»   » ‘సాహో’ భారీ బడ్జెట్ గురించి క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

‘సాహో’ భారీ బడ్జెట్ గురించి క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తికాగానే ప్రభాస్ తన తర్వాతి సినిమా షూటింగులో బిజీ కాబోతున్నాడు.

బాహుబలి 2 ఇంటర్వ్యూలో ప్రభాస్ ను తన తర్వాతి సినిమా విషయమై ప్రశ్నించగా అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తన తర్వాతి సినిమా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' పేరుతో తెరకెక్కుతోందని, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూ. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందన్నారు.

త్వరలో అఫీషియల్ ప్రకటన

త్వరలో అఫీషియల్ ప్రకటన

‘సాహో' టైటిల్ విషయమై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలువడనుంది, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు అని ప్రభాస్ తెలిపారు. ప్రభాస్ స్వయంగా ఈ ప్రాజెక్టుకు గురించి వెల్లడించడంతో అభిమానుల్లో ఈ సినిమా టైటిల్ గురించిన అనుమానాలు తొలగిపోయాయి.

బాహుబలి-ది కంక్లూజన్ తో పాటు సాహో

బాహుబలి-ది కంక్లూజన్ తో పాటు సాహో

బాహుబలి-ది కంక్లూజన్ ఈ నెల 28న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటే ‘సాహో' ఫస్ట్ లుక్. టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇలా చేయడం వల్ల ‘సాహో'కు దేశ వ్యాప్తంగా పబ్లిసిటీ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ప్రభాస్ రేంజికి తగిన విధంగా

ప్రభాస్ రేంజికి తగిన విధంగా

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. ఇపుడు ఆయన సినిమాలకు తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే సినిమాకు బడ్జెట్ ఎక్కువైనా మూడు భాషల్లో తీస్తున్నారు.

19వ మూవీ

19వ మూవీ

ప్రభాస్ కెరీర్లో ఇది 19వ సినిమా. రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నపుడు అందుకు తగిన విధంగానే మార్కెటింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. నిర్మాతలు అవన్నీ బేరీజు వేసుకుని మరీ ఇంత బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
During a recent interview, Prabhas confirmed that his next film in the direction of Sujeeth is titled 'Saaho', which is a word derived from Baahubali film. Confirming that the film is an out and out action entertainer to be made on a budget of Rs 150 Cr, Prabhas added that an official announcement regarding the title and his character would be made very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu