»   » చెన్నై వరదలు-రియల్ హీరోలు: విక్రమ్ ఆల్బంలో ప్రభాస్, రానా?

చెన్నై వరదలు-రియల్ హీరోలు: విక్రమ్ ఆల్బంలో ప్రభాస్, రానా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: గత ఏడాది డిసెంబర్ నెలలో తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో చెన్నై కకలావికలమైంది. ఆ సమయంలో చాలామంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకున్నారు. వారి సేవ నిరతి నేపథ్యంలో నటుడు విక్రమ్ 'స్పిరిట్ ఆఫ్ చెన్నై' పేరుతో ఓ ఆల్పమ్ విడుదల చేస్తున్నాడు.

'స్పిరిట్ ఆఫ్ చెన్నై'ని విక్రమ్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి సంగీతాన్ని సి గిరినాథ్ అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో జనవరి 2వ తేదీన విడుదలయింది. 'స్పిరిట్ ఆఫ్ చెన్నై' షూటింగ్ జనవరి 10వ తేదీ నాటికి పూర్తవుతుంది.

Prabhas And Rana To Feature In A Song Directed By Chiyaan Vikram

చెన్నై టి నగర్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలో దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది. పూర్తి వీడియో పాటను జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా విడుదల చేయాలని హీరో విక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.

'స్పిరిట్ ఆఫ్ చెన్నై' వీడియోలో దక్షిణాదికి చెందిన పలువురు నటులు కనిపించనున్నారు. ఇందులో ప్రభాస్, రానాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సూర్య, విజయ్, హాన్సిక, నిత్యా మీనన్, బాబీ సిన్హా, రానా, ప్రభాస్, పునీత్ రాజ్ కుమార్, నివిన్ పౌలీ తదితరులు ఇందులో కనిపించవచ్చునని అంటున్నారు.

English summary
Tamil industry folks are planning to make a special song called 'Spirit Of Chennai', as a tribute to people, who fought the devastating floods bravely. Apparently, Prabhas and Rana Daggubati will also feature in this song, which is expected to have a slew of South Indian actors.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu