Just In
- just now
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 12 min ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 1 hr ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 1 hr ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
ప్లాస్టిక్ జెండా ఎగరేశారో ఇక అంతే.. కఠిన చర్యలు తప్పవు, కేంద్రం వార్నింగ్..
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్, అనుష్క లండన్ ట్రిప్.. ప్లాన్ చేసిన రాజమౌళి.. వైరల్ న్యూస్
టాలీవుడ్ హీరో హీరోయిన్లలో ప్రభాస్, అనుష్కలకు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కావడం పైగా వెండితెరపై అద్భుతమైన కెమిస్ట్రీ పండించి అలరించడం కారణంగా ఈ ఇద్దరిపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఒకదశలో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని కూడా విన్నాం. అయితే అలా వస్తున్న ఆ వార్తలన్నీ వట్టి పుకార్లే అని ఈ జోడీ ఖండించింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్, అనుష్క లండన్ ట్రిప్ వేస్తున్నారనే వార్త వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తోంది. పైగా ఆ ట్రిప్ సినిమా షూటింగ్ నిమిత్తం కాదు అని తెలియడంతో జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఈ జోడీ లండన్ ఎందుకు వెళ్తున్నారు? అక్కడ వీళ్ళకేం పని? పూర్తి వివరాలు చూద్దామా..

అరుదైన గౌరవం.. లండన్ యాత్ర
తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అందించిన విజయంతో ప్రభాస్, అనుష్క వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించారు. ఓ తెలుగోడి దర్శకత్వ ప్రతిభ చూసి ప్రపంచ వ్యాప్త ఆడియన్స్ ఫిదా అయ్యారు. తెలుగు సినిమా చరిత్రలోనే భారీ సక్సెస్‌ఫుల్ మూవీగా నిలిచిన ఈ సినిమాను లండన్ లో ప్రదర్శించబోతున్నారు. ఇందుకోసం చిత్రయూనిట్ లండన్ పయనమైందని తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వకారణం
అక్టోబర్ నెలలో లండన్ లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'బాహుబలి 2' సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శింప బోతున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ సినిమాలను ఈ హాల్ లో ప్రత్యేకంగా ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ ఏడాది బాహుబలి 2 సినిమాకు ఆ ఛాన్స్ దక్కింది. ఓ తెలుగు సినిమాకు ఇలాంటి అరుదైన అవకాశం రావడమంటే నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగిన విషయం.

అనుష్క, ప్రభాస్ లతో పాటు జక్కన్న కూడా
లండన్ లో బాహుబలి షో ప్రదర్శన అనంతరం ప్రేక్షకులతో ముఖాముఖి కూడా ఉండనుందట. అలాగే బాహుబలి సినిమా విశేషాలను లండన్ ప్రేక్షకులతో పంచుకోనున్నారట యూనిట్ సభ్యులు. ఈ మేరకు అనుష్క, ప్రభాస్ లతో పాటు చిత్ర దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రానా దగ్గుబాటి లండన్ వెళ్లనున్నారని తెలిసింది.

లండన్ రాణి కుటుంభ సభ్యుల నడుమ
ప్రతీ ఏడాది లండన్ లో ప్రదర్శించనున్న ఈ స్పెషల్ షోలకు లండన్ లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, క్వీన్ ఎలిజిబత్ రాణి కుటుంబ సభ్యులు హాజరవుతూ ఉంటారు. కాబట్టి ఈ ఏడాది అక్టోబర్ లో జరగబోయే ఈ ప్రత్యేక కార్యక్రమంలో బాహుబలి ప్రజెంటేషన్ అద్భుతంగా జరగాలని అందుకు తగ్గ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారట రాజమౌళి.

అనుష్క సైలెన్స్, ప్రభాస్ సాహో
ప్రస్తుతం అనుష్క సైలెన్స్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగా, ప్రభాస్ సాహో సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. మరోవైపు రాజమౌళి.. RRR రూపొందించే పనిలో ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా ఈ అక్టోబర్ లో లండన్ వెళ్లేందుకు సిద్దమయ్యారట వీళ్లంతా.