»   » కేక పెట్టించే న్యూస్: ప్రభాస్‌ ఇక మేడమ్ టుస్సాడ్స్‌లో (ఫోటోస్)

కేక పెట్టించే న్యూస్: ప్రభాస్‌ ఇక మేడమ్ టుస్సాడ్స్‌లో (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... పెదనాన్న వారసత్వంతో హీరోగా తెరంగ్రేటం చేసినా, తనదైన టాలెంటుతో టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ దశ తిరిగిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి నుండి నేషనల్ స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్.

బాహుబలి సినిమా కారణంగా ప్రభాస్ ఇంటర్నేషనల్ సినీ వరల్డ్‌లో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తమ మ్యూజియంలో పెట్టాలని నిర్ణయించారు. ఇటీవలే ప్రభాస్ ను సంప్రదించి ఆయన బాడీ కొలతలు తీసుకున్నారు.

సౌత్ నుండి ప్రభాస్

సౌత్ నుండి ప్రభాస్

ఇప్పటి వరకు ఇండియన్ సినీ పరిశ్రమకు సంబంధించి అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ లాంటి పెద్ద స్టార్ల మైనపు విగ్రహాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. సౌత్ నుండి ఏ స్టార్ విగ్రహం అక్కడ లేదు.

కొలతలు

కొలతలు

ఇటీవలే మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు వచ్చి ప్రభాస్ బాడీ కొలతలు తీసకున్నారు. బాహుబలి స్టైల్ లో అచ్చం ప్రభాస్ ను పోలిన మైనపు విగ్రహం బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మనం చూడబోతున్నాం.

రాజమౌళి చెబుతానన్నది ఇదేనా?

రాజమౌళి చెబుతానన్నది ఇదేనా?

శుక్రవారం జరిగిన బాహుబలి 2 ప్రెస్ మీట్లో రాజమౌళి ప్రభాస్ అభిమానులకు అక్టోబర్ 5న ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ ఊరించారు. ఆ గుడ్ న్యూస్ బహుషా ఇదేనేమో?

ఎప్పటికి సిద్ధం అవుతుంది

ఎప్పటికి సిద్ధం అవుతుంది

ఈ మ్యూజియంలో వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీల విగ్రహాలను మాత్రమే పెడతారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు కాబట్టే అతని విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే విగ్రహం ఎప్పటికి సిద్దం అవుతుంది? అనేది తెలియాల్సి ఉంది.

గర్వించదగ్గ విషయమే

గర్వించదగ్గ విషయమే

మేడమ్ టుస్సాడ్స్ లో విగ్రమం ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో గుర్తింపు ఉంటే తప్ప ఆ అవకాశం లభించదు. ఇందులో అలాంటి అవకాశం దక్కింది అంటే గర్వించదగ్గ విషయమే.

English summary
‘Baahubali’ star Prabhas is going to be ‘waxed’ at the famous Madame Tussauds Museum in Bangkok.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu