»   » ప్రభాస్ పెళ్లి వార్తల గోలపై.... స్పందించిన ప్రభాస్ కజిన్!

ప్రభాస్ పెళ్లి వార్తల గోలపై.... స్పందించిన ప్రభాస్ కజిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమా తర్వాత అందరి ఫోకస్ ప్రభాస్ పెళ్లి వైపు మళ్లిన సంగతి తెలిసిందే. బాహుబలి-2 సినిమా విజయం గురించి ఎంతగా మాట్లాడుకున్నారో ప్రభాస్ పెళ్లి గురించి కూడా స్థాయిలో మీడియాలో వార్తలు, గాసిప్పులు ప్రచారంలోకి వచ్చాయి.

దీంతో పాటు సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ ఎక్కడికెళ్లినా ఆయన పెళ్లి గురించిన ప్రశ్నలే ఎదురయ్యేవి. ప్రభాస్ తన పెళ్లి గురించి ఎటూ తేల్చక పోవడంతో..... తనతో పాటు బాహుబలి మూవీలో కలిసి పని చేసిన అనుష్కనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

బిజినెస్ టైకూన్ మనవరాలితో అంటూ...

బిజినెస్ టైకూన్ మనవరాలితో అంటూ...

కొన్ని రోజుల తర్వాత బిజినెస్ టైకూన్ మనవరాలితో ప్రభాస్ పెళ్లి జరుగబోతోందని, రాశి సిమెంట్స్ ఎండి భూపతి రాజు మనవరాలితో ప్రభాస్ పెళ్లి జరుగబోతోందని, ప్రభాస్ పెదనాన్న కృష్టం రాజు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రచారం జరిగింది.

6000 ప్రపోజల్స్ రిజక్ట్

6000 ప్రపోజల్స్ రిజక్ట్

అన్నింటికంటే ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే.... ప్రభాస్ కు ఇప్పటి వరకు 6000 పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని, వాటన్నింటికీ ప్రభాస్ తిరస్కరించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై స్పందించిన ప్రభాస్ కజిన్

ఈ వార్తలపై స్పందించిన ప్రభాస్ కజిన్

ప్రభాస్ పెళ్లి గురించి ఇన్ని రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చినా..... ఇప్పటి వరకు ప్రభాస్ గానీ, ప్రభాస్ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. తొలిసారి ప్రభాస్ కజిన్ ఒకరు ఈ వార్తలపై స్పందిస్తూ... ఇవన్నీ కేవలం పుకార్లే అని, ఎవరో కావాలని వీటిని ప్రచారం చేస్తున్నారని తేల్చి చెప్పారు. అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు ఎలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు.

బాహుబలిపై ప్రభాస్ కుల అభిమానుల ప్రభావం, తన రెమ్యూనరేషన్‍‌పై రాజమౌళి ఇలా...

బాహుబలిపై ప్రభాస్ కుల అభిమానుల ప్రభావం, తన రెమ్యూనరేషన్‍‌పై రాజమౌళి ఇలా...

బాహుబలిపై ప్రభాస్ కుల అభిమానుల ప్రభావం, తన రెమ్యూనరేషన్‍‌పై రాజమౌళి ఇలా మాట్లాడారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Prabhas' cousin speak about Prabhas marriage rumours. He said “After the film released, everyone wants another issue to talk about. So, they are spreading these rumours. It is not true,”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu