»   » బాహుబలిపై ప్రభాస్ కుల అభిమానుల ప్రభావం, తన రెమ్యూనరేషన్‍‌పై రాజమౌళి ఇలా...

బాహుబలిపై ప్రభాస్ కుల అభిమానుల ప్రభావం, తన రెమ్యూనరేషన్‍‌పై రాజమౌళి ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో కులాల ప్రభావం బాగా ఉందని, తమ కులానికి చెందిన హీరోను గెలిపించుకోవడానికి ఆయా కులాలకు చెందిన అభిమానులు ప్రయత్నిస్తుంటారనే వాదన చాలా కాలంగా ఉంది.

తాజాగా ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళికి ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. తెలంగాణలో లేదు గానీ ఆంధ్రలో కుల ప్రాతిపదికన హీరోలను చూడటం, ఫలానా కులం వాడిదీ సినిమా ఇన్ని రోజులు ఆడితే, మనం కులం వాడి సినిమా ఇన్ని రోజులు ఆడించాలి అని చూస్తుంటారు కదా.... అని ఆర్కే ప్రశ్నించగా రాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

కులం ప్రభావంపై రాజమౌళి

కులం ప్రభావంపై రాజమౌళి

కులం అనే అభిమానం నిజానికి ఫ్యాన్స్‌కు ఉన్నంత హీరోలకు ఉండదు. ఇక ప్రభాస్‌ కంప్లీట్లీ డిఫరెంట్‌. పేరులోనే ప్రభాస్‌ రాజు అని పెట్టుకోడు.... బాహుబలి సినిమాపై అలాంటి ప్రభావం పడలేదనే భావిస్తున్నాను అని రాజమౌళి తెలిపారు.

బాహుబలి కలెక్షన్లపై

బాహుబలి కలెక్షన్లపై

బాహుబలి కలెక్షన్ల రాజమౌళి స్పందిస్తూ..... ఇప్పటి వరకు 1500 కోట్లు దాటింది. 1580..1590 వరకు వచ్చాయి. చైనాలో రిలీజ్‌ చేయాల్సి ఉంది. చైనాలో వచ్చేది తక్కువే. అన్ని ఖర్చులుపోనూ 12.5 శాతమే చేతికొస్తుంది అని రాజమౌళి ఆర్కే ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రభాస్ ఎద్దులా పని చేస్తాడు

ప్రభాస్ ఎద్దులా పని చేస్తాడు

పర్సనల్ లైఫ్ లో ప్రభాస్, ఆయన ఫ్రెండ్స్‌ బద్దకస్తులు. సినిమా దగ్గరకొచ్చేసరికి ఎద్దులా పనిచేసే వాడు. క్యారెక్టర్‌ డిజైనింగ్‌లో ప్రభాస్‌ కూడా కూర్చున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్లు కష్టపడ్డాడు. లైఫ్‌ పెట్టాడు అని రాజమౌళి తెలిపారు.

బాహుబలికి రెమ్యూనరేషన్

బాహుబలికి రెమ్యూనరేషన్

బాహుబలి సినిమాకు ఎంత తీసుకుంటున్నారు? అని అడిగితే......... పర్సెంటేజ్‌ తీసుకుంటాను. ఇదేమీ సీక్రెట్‌ కాదు. ‘బాహబలి'కి తక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకున్నా. సినిమా హిట్‌ అయితే పర్సెంటేజ్‌లు తీస్కుంటాను. లేకపోతే పోతుంది. అయినా సరే నిర్మాతను టెన్షన్‌ పెట్టినట్లే. బాహుబలిని ప్రామాణికంగా తీసుకోకూడదు. ఏదేమైనా నా పర్సెంటేజ్‌ని చెప్పకూడదని కాదు.. నా విషయం చెబితే ఇతరుల పర్సెంటీజీలను గురించి కూడా చెప్పాలి. అది నాకిష్టం ఉండదు అని రాజమౌళి తెలిపారు.

రిటైర్మెంట్

రిటైర్మెంట్

రిటైర్మెంట్ ఇపుడే అనుకోవడం లేదు. మహాభారతం' తర్వాత రిటైర్‌మెంట్‌ ఉంటుందేమో. మానాన్న గారిని చూస్తే సిగ్గేస్తుంటుంది. ఎందుకంటే.. ఆయనకి 75 ఏళ్ల వయసు. బాంబే, మద్రాసు తిరిగేస్తుంటారు. ఎవరికైనా కథ చెబితే, బాలేదన్నారనుకోండి. మరోకథ చెబుతారు. ఉదయం ఐదింటికి నిద్రలేస్తారు. పడుకునే పదిగంటల వరకూ కథల గురించే ఆలోచిస్తారు అని రాజమౌళి తెలిపారు.

ఊహించలేదు

ఊహించలేదు

ముంబైలో బాహుబలి 2 రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ కోసం వెళ్లాం. 400 మంది కూర్చునే థియేటర్‌ అది. అమీర్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌లాంటి వాళ్లకు కూడా 50 శాతం ప్రెస్‌పీపుల్‌ వస్తారు. అలాంటిది మేం వెళ్లినపుడు థియేటర్లలో నుంచి విజిల్స్‌, అరుపులు. ఫ్యాన్స్‌ను కూడా వదిలేసారేమో అనుకున్నాం. కానీ మొత్తం హిందీ మీడియా పీపుల్‌. ప్రభాస్‌కు స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. ఫ్యాన్స్‌ ఎలా దిగుతారో అలా ప్రభాస్‌తో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు అని రాజమౌళి తెలిపారు.

English summary
Rajamouli about Baahubali-2 movie and his remunaration. Baahubali's Director SS Rajamouli talks exclusively for RK interview show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu