»   » ప్రభాస్ 'డార్లింగ్' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

ప్రభాస్ 'డార్లింగ్' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తో 'తొలిప్రేమ' వంటి హిట్ అందించిన కరుణాకరన్ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా రూపొందిన 'డార్లింగ్' చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియచేయటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. కరుణాకరన్ తనకెంతో ఇష్టమైన దర్శకుడనీ, ఆయన తీసిన 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రాలు చూసి తానెంతో ఇంప్రెస్ అయ్యాననీ చెప్పారు. అలాగే ఈ చిత్ర కథ కూడా తననెంతో ప్రభావితం చేసిందనీ, ప్రేమ, యాక్షన్, ఎంటర్టైన్ మెంట్ కలగలసిన ఫ్యామిలీ ఫీల్ ఉన్న సినిమా ఇదనీ చెప్పారు.

ఇక నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్ర విశేషాలు తెలియచేస్తూ..."కరుణాకరన్‌ తరహాలో మంచి ఫీల్‌ వున్న సినిమా ఇది. లవ్‌ఫీల్‌, ఫ్యామిలీడ్రామా, యాక్షన్‌... ఇలా అన్ని అంశాల మేలుకలయిక ఈ చిత్రం. ఇటు యూత్, అటు ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకునే విధంగా కరుణాకరన్ ఎక్స్ టార్డినరీగా తీశారు. టేకింగ్ సైడ్ గానీ, మేకింగ్ సైడ్ గానీ రిచ్ గా ఉంటుందన్నారు. అలాగే దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ "క్లాస్‌గా కనిపించే మాస్‌ లవ్‌స్టోరీ ఇది. ప్రభాస్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ ఈ చిత్రానికి మంచి బాణీలను ఇచ్చారన్నారు. ప్రభాస్ అద్భుతమైన నటన ప్రదర్శించారనీ, నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారనీ చెప్పారు. ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, ప్రభాస్ శ్రీను, రాజాశ్రీధర్ తదితరులు నటించారు. స్వామి మాటలు, అనంత్ శ్రీరామ్ పాటలు, ఆండ్రూ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ పైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu