»   » వరద బాధితులకు ప్రభాస్‌ విరాళం

వరద బాధితులకు ప్రభాస్‌ విరాళం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 9 జిల్లాలు వరద తాకిడికి గురైన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా చెన్నై పట్టణం ముంపుకు గురి కావడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఎంతో మంది నిరాశ్రయులు కావడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీకు చెందిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

అందులో భాగంగా రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కలిసి వరద బాధితులకు 15 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేస్తారు.

వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నై నగరానికి సహాయం చేయడానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రూ. 25 లక్షల విరాళం అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Prabhas donates 15 lakhs for chennai flood

మహేష్ బాబు చెన్నై వరద బాధిుతలకు రూ. 10 లక్షల సహాయం ప్రకటించారు. తమిళనాడు సి.ఎం.రిలీజ్ ఫండ్ కి ఈ విరాళాన్ని అందజేస్తారు. మహేష్ బాబు మాట్లాడుతూ...భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్తితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సహాయంగా రూ. 10 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాను అన్నారు.

ప్రస్తుతం చెన్నై నగరం లో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు.

"చెన్నై నేను పుట్టిన నగరం. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్ను ఎంతగానో కలచివేసింది. నా వంతు సహాయం గా నేను 3 లక్షల రూపాయలను CM రిలీఫ్ ఫండ్ కి పంపిస్తున్నాను. అందరూ తమకు తోచినంత సహాయం చేయవలసింది గా కోరుతున్నాను", అని అన్నారు.

వీరితో పాటు జూ ఎన్టీఆర్ రూ. 10 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, రవితేజ రూ. 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. 50 వేల సహాయం ప్రకటించారు.

English summary
Prabhas announced a generous contribution of Rs 15 lakhs towards the Chennai floods relief activities.
Please Wait while comments are loading...