»   » ప్రభాస్ తొలి యాడ్ సైన్ చేసాడు, ఏ కంపెనీకో తెలుసా?

ప్రభాస్ తొలి యాడ్ సైన్ చేసాడు, ఏ కంపెనీకో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సౌతిండియా నుండి రూ. 500 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇండియన్ సినీ చరిత్రలో ‘బాహుబలి' ఒక సెన్సేషన్.

ఈ సినిమా పుణ్యమా అని ప్రభాస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. పలు కార్పొరెట్ కంపెనీల దృష్టి కూడా ప్రభాస్ వైపు మళ్లింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తొలి యాడ్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా... తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న XUV 500కు ప్రభాస్‌ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్లు సమాచారం.


Prabhas is National Brand Ambassador for Mahindra Vehicles

మహీంద్రా గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా బాహుబలి సినిమా చూసి ముగ్దుడైపోయాడు. ఇండియన్ సినిమా పరిశ్రమ సత్తా చాటేలా ఉందని, హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోలేదని ఆయన ట్వీట్ చేసారు. ఈ క్రమంలోనే ఆయన దృష్టి ప్రభాస్ మీద పడిందని, ఆయన సూచన మేరకే కంపెనీ ప్రతినిధులు ప్రభాస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.


బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే దాదాపు 40 శాతం పూర్తయింది. మిగిలిన షూటింగ్ అక్టోబర్ నుండి మొదలు పెట్టబోతున్నారు. 2016లో బాహుబలి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అనుష్క(దేవసేన) పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుంది. బాహుబలి, దేవసేన మధ్య సాగే లవ్ ట్రాక్ ఆసక్తికరంగా ఉంటుంది.

English summary
If the ongoing buzz is to be believed, it is heard that Prabhas will endorse Mahindra Vehicles and he has become a National Brand Ambassador for Mahindra vehicles. This is the first endorsement ad for Mahindra’s new XUV 500.
Please Wait while comments are loading...