నిర్మాతగా ఆలీ మొదటి సినిమా... ఆలీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఎవరు చేయని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన ఏ మాత్రం ఒక స్టార్ లా ఫీల్ అవ్వడం లేదు. మనస్తత్వంలో మొదట్లో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఇండస్ట్రీలో సహాయం కోసం ఎవరు వచ్చినా కూడా కాదనకుండా తనకు వీలైనంత సపోర్ట్ అయితే చేస్తున్నాడు.
మొదట్లో తనతో సన్నిహితంగా ఉన్న వారిని కూడా రెబల్ స్టార్ ఏ మాత్రం దూరం పెట్టలేదు. ఎలాంటి సందర్భంలో అయినా కూడా వారికి అండగా ఉంటున్నాడు. ఇక కమెడియన్ ఆలీ కూడా ప్రభాస్ కు ఒకప్పుడు. మంచి స్నేహితుడే. బిల్లా సినిమాలో కమెడియన్ రోల్ కోసం ప్రభాస్ ఏరికోరి మరి ఆలీని సెలెక్ట్ చేయించాడు. ఇక ఇప్పుడు మొదటిసారి అలీ నిర్మాతగా మారుతూ ఒక సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' సినిమాను అలీ సొంత ప్రొడక్షన్ అలీవూడ్ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించారు. ఆలీతో పాటు సీనియర్ యాక్టర్ నరేష్ కూడా నటించిన ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ప్రమోషన్ లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను రంగంలోకి దింపారు. సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను ఈ శుక్రవారం సాయంత్ర 4:05కు రిలీజ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాతో నిర్మాతగా ఆలీ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











