For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి తీయబోయే చిత్రంలో ప్రభాస్ గెటప్ ఇదా

  By Srikanya
  |

  రీసెంట్ గా జరిగిన మిర్చి ఆడియో పంక్షన్ లో ప్రభాస్... పూర్తిగా గెడ్డంతో కనపడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా ఎప్పుడూ క్లీన్ షేవ్ తో ఉండే ప్రబాస్ ఒక్కసారిగా ఇలా గెడ్డంతో కనపడేసరికి అందరికీ ఆశ్చర్యం వేసింది. త్రివిక్రమ్ లాగ ఉన్నాడని కామెంట్స్ చేస్తుంటే, అసలు ఇలా హఠాత్తుగా గెడ్డం పెంచటానికి కారణమేమిటనే సందేహం చాలా మందిలో కలిగింది. అయితే దానికి ప్రభాస్ సమాధానం చెప్పాడు. రాజమౌళి కొత్త సినిమాకోసమని, ఆ విషయం రాజమౌళినే అడగమని తేల్చి చెప్పేసాడు. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందే పీరియడ్ డ్రామాలో ప్రబాస్ ఇలా గెడ్డంతో కొంత సేపు కనిపించనున్నాడని తెలుస్తోంది.

  2013 సంవత్సరంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకునే ప్రాజెక్టు ఏమిటంటే... ప్రభాస్, రాజమౌళి సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రం కోసం రాజమౌళి అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌తో రాజమౌళి చేయనున్న ఈ భారీ చిత్రరాజం జానపదమా? లేక చారిత్రాత్మకమా? లేక పౌరాణికమా? అనేది మాత్రం అందరిలో క్వచ్చిన్ మార్క్ గానే మిగిలి ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు తెలియ వచ్చాయి.

  అందిన విశ్వనీయ సమాచారం ప్రకారం ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం భారీ జానపద చిత్రరాజమని తెలుస్తోంది. దాదాపు వంద కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో ఆర్కామీడియా ఈ సినిమాను తెరకెక్కించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో ప్రక్క ఈ సినిమాలో అనూష్కని హీరోయిన్ గా ఎంపిక చేసారు.

  ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను హైదరాబాద్‌కు తరలించనున్నారని కూడా సమాచారం. ఇదిలావుంటే... కథ రీత్యా ఈ సినిమాలో హీరో పాత్రకు సమానమైన విలన్ పాత్ర. ఆ పాత్రను ఓ స్టార్‌హీరోతోనే చేయించాలని రాజమౌళి భావించారని వార్తలు వస్తున్నాయి. 'కృష్ణంవందే జగద్గురుమ్'తో తన ప్రతిభను నిరూపించుకున్న దగ్గుబాటి రానాను ఈ పాత్ర కోసం రాజమౌళి సంప్రదించారని చెప్తున్నారు. రానా కూడా ఈ పాత్ర చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని ఫిలింనగర్ సమాచారం.

  ఇక ఈ చిత్రం గురించి నిర్మాత దేవినేని ప్రసాద్ మాట్లాడుతూ... "ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మా ఆర్కా మీడియా సంస్థ ఇటు సినిమా రంగంలోనూ, అటు టీవీ రంగంలోనూ ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థపై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ గతంలో 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

  English summary
  While film buffs have been trying to find out how Prabhas-Rajamouli's film would be like, the young rebel star has shown a glimpse of it. The actor dropped with his new look for the music launch of his upcoming film Mirchi and has created quite a buzz with his appearance. Prabhas was seen sporting a beard and rugged looks and its' been buzzed that the special look will be for Rajamouli's film. When asked about the new look, Prabhas pointed his fingers towards Rajamouli and said "ask him". Apparently, the character in period drama might need beard for certain part of footage and as such the actor has started working on his characterization.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X