twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆదివారమే ఆ ఛానెల్‌లో రాధే శ్యామ్ ప్రీమియర్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవాను చూపించి.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇక, అప్పటి నుంచి అన్నీ భారీ సినిమాల్లోనే నటించాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే కొన్నేళ్ల క్రితం 'సాహో' అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్.. ఇటీవలే 'రాధే శ్యామ్' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా నెగెటివ్ టాక్‌ను అందుకుని నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా భారీ స్థాయిలో నష్టాలను కూడా చవి చూసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఆదివారమే టెలివిజన్‌పై సందడి చేయబోతుంది. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా వెల్లడించాడు. ఆ వివరాలు మీకోసం!

     ‘రాధే శ్యామ్‌'తో వచ్చిన ప్రభాస్

    ‘రాధే శ్యామ్‌'తో వచ్చిన ప్రభాస్


    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన చిత్రమే 'రాధే శ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్టుగా చేశాడు. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం ఇచ్చాడు.

    హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందింత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందింత?


    ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన 'రాధే శ్యామ్' మూవీకి ప్రేక్షకుల మద్దతు లభించలేదు. దీంతో ఏపీ, తెలంగాణలో ఈ చిత్రానికి ఇప్పటి వరకూ కేవలం రూ. 55 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాదు, ఈ సినిమా మిగిలిన ప్రాంతాల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 83 కోట్లకు పైగా షేర్‌తో పాటు రూ. 150 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

     టార్గెట్ అలా.. మూవీకి భారీ నష్టం

    టార్గెట్ అలా.. మూవీకి భారీ నష్టం


    ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 83 కోట్లకు పైగానే వసూలు చేసింది. అంటే దీనికి దాదాపు రూ. 120 కోట్లకు పైగా నష్టాలు ఎదురయ్యాయి.

    హాట్ సెల్ఫీతో షాకిచ్చిన రాశీ ఖన్నా: మేకప్ రూమ్‌లో అందాలు ఆరబోస్తూ ఫోజులుహాట్ సెల్ఫీతో షాకిచ్చిన రాశీ ఖన్నా: మేకప్ రూమ్‌లో అందాలు ఆరబోస్తూ ఫోజులు

    నెల లోపే ఆ ఓటీటీలో స్ట్రీమింగ్

    నెల లోపే ఆ ఓటీటీలో స్ట్రీమింగ్


    భారీ బడ్జెట్‌తో రూపొందిన 'రాధే శ్యామ్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దీని రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ అత్యధిక డీల్‌కు కొనుగోలు చేసింది. అంతేకాదు, విడుదలై నెల రోజులు కాకముందే స్ట్రీమింగ్‌ను కూడా మొదలెట్టింది.

     టెలివిజన్‌లో ప్రభాస్ రాధే శ్యామ్

    టెలివిజన్‌లో ప్రభాస్ రాధే శ్యామ్

    థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన 'రాధే శ్యామ్' మూవీ.. ఓటీటీలో మాత్రం రికార్డు స్థాయిలో స్పందనను అందుకుంది. దీంతో ఎన్నో రికార్డులు కూడా బద్దలైపోయాయి. ఇక, ఇప్పుడు ఈ సినిమాను బుల్లితెరపై ప్రసారం చేయబోతున్నారు. అయితే, ఇది తెలుగు వెర్షన్ మాత్రం కాదు. హిందీలో ఈ సినిమా ప్రసారం కాబోతుంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

    నీ బాడీలో ఏ పార్టులకు సర్జరీ చేయించావ్: శృతి హాసన్‌కు నెటిజన్ ప్రశ్న.. దానికే చేయించా అంటూ!
    l

     ఆ ఛానెల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా

    ఆ ఛానెల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా


    'రాధే శ్యామ్' హిందీ టెలివిజన్ ప్రీమియర్ హక్కులను జీ ఛానెల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని ఏప్రిల్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియోను సైతం విడుదల చేశాడు.

    English summary
    Prabhas Did Radhe Shyam Movie Under Radha Krishna Kumar Direction. This Movie Hindi Version Television Premiere on April 24th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X