»   » బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ వెంట పడుతున్న కార్పొరెట్ కంపెనీలు!

బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ వెంట పడుతున్న కార్పొరెట్ కంపెనీలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సౌతిండియా నుండి రూ. 500 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇండియన్ సినీ చరిత్రలో ‘బాహుబలి' ఒక సెన్సేషన్.

ఈ సినిమా పుణ్యమా అని ప్రభాస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. పలు కార్పొరెట్ కంపెనీల దృష్టి కూడా ప్రభాస్ వైపు మళ్లింది. ఇప్పటికే ఓ సాఫ్ట్ డ్రింక్ కంపెనీతో పాటు, ఓ టూట్ పేస్ట్ కంపెనీ వారు ప్రభాస్ తో సంప్రదింపులు జరిపారని, తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన్ను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

 Prabhas ready to enter in Ad World

ఇప్పటికే విడుదలైన బాహుబలి సినిమా భారీ క్రేజ్ వచ్చింది. త్వరలో బాహుబలి పార్ట్ 2 కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలో అతనితో యాడ్ ఫిల్మ్స్ చేసి వదిలితే బాగా వర్కౌట్ అవుతుందని పలు కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయట. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ ఇంకా ఏ కంపెనీకి ఓకే చెప్పలేదని సమాచారం. త్వరలోనే ఏ విషయం అనేది తేలనుంది.

ఇప్పటికే తెలుగు మార్కెట్లో యాడ్ ఫిల్మ్స్ విషయంలో మహేష్ బాబు టాపులో ఉన్నాడు. అయితే ఆయన చాలా కాస్లీ యాక్టర్ కావడంతో, ఇప్పటికే చాలా ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ ఇప్పటికే యాడ్స్ చేస్తున్నప్పటికీ....వీరు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. బాహుబలి సినిమాకు దేశ వ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్ తో పలు కంపెనీలు ప్రభాస్ వైపు మొగ్గు చూపుతున్నాయని అంటున్నారు.

English summary
Baahubali actor Prabhas ready to enter in Ad World.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu