twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రెబల్’లో ప్రభాస్ చెప్పే ఆ డైలాగ్ హైలెట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్'. ఈ చిత్రంలో తాను చెప్పే...''ప్రతివాడు మగాడు అనుకోవడానికి అది ఇంటి పేరు కాదు... బై బర్త్ అది బ్లడ్‌లో ఉండాలి'' డైలాగు హైలెట్ అని ప్రబాస్ చెప్తున్నారు. లారెన్స్ దర్శకత్వంలో తాను హీరోగా రూపొందిన 'రెబల్' చిత్రంలో ఇలాంటి శక్తివంతమైన డైలాగులు చాలా ఉన్నాయంటున్నారు ప్రభాస్. వరసగా ప్రేమకథా చిత్రాల్లో నటించిన తనకు ఈ మాస్ మూవీ చాలా కిక్ ఇచ్చిందని, తన పాత్ర మాస్ అని చెప్పారు.

    Rebel

    ప్రభాస్‌ హీరోగా నటించిన సినిమా 'రెబల్‌'. తమన్నా, దీక్షాసేథ్‌ కథానాయికలు. రాఘవ లారెన్స్‌ దర్శకుడు. శ్రీ బాలాజీ సినీ మీడి యా పతాకంపెై జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మించారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోందీ సినిమా. ఈ విషయం ఖరారు చేయటానికి నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇచ్చిన సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీసాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు.

    నిర్మాతలు మాట్లాడు తూ- ''స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇటీవ ల రిలీజెైన ఆడియో ఘనవిజయం సాధించింది. త్వరలో ప్లాటినం డిస్క్‌ వేడుక చేయనున్నాం. హాలీవుడ్‌ స్థాయి సాంకేతికతతో తెరకెక్కిన చిత్రం ఇది. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఇది. ప్రభాస్‌కి 'రెబల్' హ్యాట్రిక్ మూవీ అవుతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని లారెన్స్ హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. ఉత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

    బ్రతుకు మీద ఆశ లేని వాడే రణ రంగంలో అడుగు పెట్టాలి, యమ పాశం అడుగుదూరంలో ఉన్న చిరునవ్వు చిందాలి, అవకాశం వస్తే మాత్రం లక్ష్యం వైపు దూసుకు పోవాలి, చావుకు మస్కా కొట్టి మన పని మనం చేసుకోవాలి దానికి చాలా తెగువ కావాలి...అలాంటి క్యారెక్టర్ ప్రభాస్ ది రెబెల్ లో అంటున్నారు లారెన్స్. దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ...'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. 'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది అన్నారు.

    ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

    English summary
    Rumours are rife that there might be a reshuffle in the release date of 'Rebel' film on account of Ganesh Visarjan (September 29) and Telangana March (September 30). Producers confirm that the film will be hitting the marquee on September 28 as planned, and has not been pushed back. Tamannaah and Deeeksha Seth have played the female leads. Raghava Lawrence, who directed the movie, has also scored the music for this mass entertainer. Rebel, which is currently in post-production stage, is jointly produced by J Bhagawan and J Pulla Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X