twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్టా? ఫట్టా?..రెబల్ మూవీ టాకేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన 'రెబల్' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. సినిమా డిమాండ్ కు తగిన విధంగా భారీగా థియేటర్లు కేటాయించారు. ప్రభాస్ గత సినిమా డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ హిట్ చిత్రాలు కావడంతో 'రెబల్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రెండు క్లాస్ సినిమాలే. చత్రపతి తరువాత సరైన మాస్ సినిమా లేని ప్రభాస్ మాస్ ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ లారెన్స్ కలిసి చేసిన సినిమా రెబల్. ప్రభాస్ కి జోడీగా తమన్నా, దీక్ష సేథ్ నటించిన ఈ సినిమాకి కథ, కథనం, సంగీతం, కొరియోగ్రఫీ, దర్శకత్వం అన్ని విభాగాల్ని లారెన్స్ నిర్వహించాడు.

    సినిమా టాక్ విషయాని కొస్తే...'రెబల్' చిత్రం తొలిరోజే మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా కేవలం మాస్ ఆడియన్స్, ప్రభాస్ నుంచి ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీ ఆశిస్తున్న వీరాభిమానుల కోసం మాత్రమే తీసినట్లు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారెన్స్ తన గత సినిమాలు మాస్, డాన్, కాంచన సినిమాల నుంచి చాలా సీన్లు కాపీ చేసి ఇందులో పెట్టేయడం చాలా మందికి నచ్చడం లేదు. ఎంటర్ టైన్మెంట్స్ లెవల్స్ తగ్గి...యాక్షన్ లెవల్స్ మరీ ఎవర్ అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. లారెన్స్ కథ, కథనం కంటే ఫైట్స్, తమన్నా గ్లామర్ ఎక్స్ ఫోజ్ చేయడంపైనే ఎక్కువ కేర్ తీసుకున్నాడు. ఇంటర్వెల్ ముందు ఫైట్స్ బావున్నప్పటికీ 30 మంది రష్యన్ ఫైట్ మాస్టర్స్ తో చేయించిన క్లైమాక్స్ ఫైట్ ఆకట్టుకోలేదు.

    ఇక టెక్నికల్ అంశాల పరంగా చూస్తే...లారెన్స్ అందించిన సంగీతం చిత్రానికి మైనస్ గా మారింది. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. మార్తాండ్ కె. వెంకటేస్ ఎడిటింగ్ యావరేజ్. కొరియోగ్రఫీ మాత్రం ఇరగదీసాడు. మొత్తానికి ఈచిత్రానికి కేవల ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ తప్ప....ఇతర వర్గాల ప్రేక్షకులు పెద్దగా ఆదరించే అవకాశం లేదు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అంటున్నారు.

    English summary
    Prabhas film ‘Rebel’ hot the screens after a long gap of almost eighteen months. Director Raghava Lawrence who is high after the hit of ‘Kanchana’ raised the expectations of the film promised it as out and out mass film. Leaving the illogical scenes aside, the movie suffered a lot at screenplay. First 45 minutes there is absolutely no story except love track between Prabhas and Tamannah. Story picks up before interval and takes a nose dive after the interval with lame flashback story before ending with a bloodshed climax.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X