»   » బాహుబలి-3.... రాజమౌళి ఫోన్‌తో షాకైన ప్రభాస్! (వీడియో)

బాహుబలి-3.... రాజమౌళి ఫోన్‌తో షాకైన ప్రభాస్! (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' ప్రాజెక్టు కోసం హీరో ప్రభాస్ తన కెరీర్‌ను పనంగా పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు నాలుగేళ్ల పాటు ఇతర సినిమాలేవీ చేయకుండా కేవలం ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే తన పూర్తి సమయం కేటాయించాడు.

అంతే కాకుండా.... ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమించాడు. అఫ్ కోర్స్ ప్రభాస్ పడ్డ కష్టానికి తగిన గుర్తింపు కూడా లభించింది. అయితే బాహుబలి లాంటి మరో ప్రాజెక్టు మాత్రం చేయడానికి ప్రభాస్ సిద్ధం లేడు. అయితే రాజమౌళి ఫోన్ చేసి బాహుబలి-3 చేద్దామని అడగ్గానే ప్రభాస్ షాకయ్యాడు. ఓ టీవీ షోలో భాగంగా ప్రభాస్ ను ఆటపట్టించడానికి రాజమౌళి ఇలా చేశాడు.

రానా ‘నెం.1 యారి’

రానా ‘నెం.1 యారి’

రానా హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారి' అనే కార్యక్రమానికి బాహుబలి దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ప్రభాస్ షాకింగ్ రియాక్షన్

ప్రభాస్ షాకింగ్ రియాక్షన్

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్‌ను ఆటపట్టించారు రాజమౌళి. ప్రభాస్ కు ఫోన్ చేసి.... అర్జంటుగా నిన్ను కలవాలి, బాహుబలి-3 గురించి మాట్లాడాలని అనగానే ప్రభాస్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆర్టికల్ చివర్లో వీక్షించండి.

పవన్ కళ్యాణ్ అనగానే సెంటర్లో...

పవన్ కళ్యాణ్ అనగానే సెంటర్లో...

ఈ షోలో భాగంగా రాజమౌళి విల్లంబు ఎక్కుపెట్టి బాణాలు ప్రయోగించే ఆట ఆడారు. పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుని బాణం వేయగానే సెంటర్లో తగిలింది. ఎంతో ఆసక్తికరంగా ఈ షో సాగింది.

వీడియో ప్రోమో

ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియోను మీరూ వీక్షించండి.

English summary
During a TV show hosted by Rana Daggubati, Rajamouli was asked to call Prabhas and propose him to meet over to discuss Baahubali 3. When Rajamouli made the call, Prabhas reacted saying, 'Amma nee yamma' (laughs..) as soon as he heard of the word Baahubali 3.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu