»   » బాహుబలి అయిపోతే మాత్రం మరీ ఇలానా? ప్రభాస్ కొత్త సినిమా టీజర్ కూడా

బాహుబలి అయిపోతే మాత్రం మరీ ఇలానా? ప్రభాస్ కొత్త సినిమా టీజర్ కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రన్‌ రాజా రన్‌తో దర్శకుడిగా పరిచయమై టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకున్న సుజిత్‌ తన రెండో సినిమాకే నూట యాభై కోట్ల బడ్జెట్‌ సాధించాడు. మొదట్లో యాభై కోట్లలో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్ట్‌ షేప్‌ మారిపోయి నూట యాభై కోట్ల సినిమాగా తయారైంది. సుజిత్‌పై యువి క్రియేషన్స్‌ అధినేతలు, ప్రభాస్‌ చూపిస్తున్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఏ దర్శకుడికైనా ఇది కలలాంటి ప్రాజెక్ట్‌. యువి క్రియేషన్స్‌లో ఇప్పటివరకు తెరకెక్కిన ఒకే ఒక్క భారీ చిత్రం మిర్చి.

నలభై కోట్లతో తీసిన ఆ చిత్రం తర్వాత వారు ఎక్కువగా చిన్న చిత్రాలకే మొగ్గు చూపారు. మరి నూట యాభై కోట్ల సినిమాని తలపెడుతూ సుజిత్‌లాంటి యువ దర్శకుడిని ఎంచుకున్నారంటే వారి ధైర్యాన్ని ఏమనుకోవాలి? ఇంతవరకు దర్శకుల టాలెంట్‌నే నమ్ముతూ వచ్చిన యువి క్రియేషన్స్‌ ఈసారి కూడా సుజిత్‌ ప్రతిభనే నమ్ముతూ ఇదతను హ్యాండిల్‌ చేస్తాడనే కాన్ఫిడెన్స్‌తో అతను అడిగిన వనరులు అన్నీ సమకూరుస్తున్నారు.


prabhas sujeeth movie teaser attached in baahubali

ప్రభాస్ ప్రొడక్షన్‌లో 2014లో తెలుగు రొమాంటిక్ కామెడీ రన్ రాజా రన్ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సుజిత్ తీస్తున్న కొత్త చిత్రంలో ప్రభాస్ పవర్‌పుల్ పోలీస్ అధికారి పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లేందుకు చాలా సమయం పట్టనుంది. కానీ ఈ సినిమా టీజర్‌ మాత్రం 'బాహుబలి-2'లోనే రానుంది. ఏంటి నమ్మారా...? నిజమండి. ఈ మూవీ టీజర్‌ను మొదట షూట్‌ చేసి దాన్ని ఏప్రిల్ 28న విడుదల కానున్న 'బాహుబలి-2' క్లైమాక్స్‌లో అటాచ్‌ చేయాలని దర్శకుడు సుజిత్‌ ప్లాన్‌ వేశాడు.


త్వరలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కాబోతున్న 'బాహుబలి: ది కంక్లూజన్‌' సినిమాతోపాటే తమ కొత్త సినిమా టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ మే నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే టీజర్‌ కోసం అవసరమైన యాక్షన్‌ సీన్స్‌ను మార్చి నెలలో షూట్‌ చేయాలని అనుకుంటున్నారట. 'బాహుబలి'తో పాటు ఈ సినిమా టీజర్‌ విడుదల చేసేస్తే సులభంగా పబ్లిసిటీ దక్కించుకోవచ్చు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సుజిత్‌, ప్రభాస్‌ సినిమా బడ్జెట్‌ ఏకంగా 150 కోట్ల రూపాయలు అనే విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టే ప్రమోషన్‌ కూడా హై లెవెల్‌లో ఉండాలని ప్లాన్‌ చేస్తోందట చిత్ర బృందం.

English summary
According to sources, director Sujith will be shooting some portion of the movie in March which will be developed into a teaser. This teaser will then be attached to the movie of 'Baahubali 2'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu