»   » ఫోటోలు : మొరటోడిలా పెళ్లికి హాజరైన ప్రభాస్

ఫోటోలు : మొరటోడిలా పెళ్లికి హాజరైన ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల అన్నవరంలోని ఓ వివాహ వేడుకకు హాజరై జనాలను, ముఖ్యంగా చిన్న పిల్లలు జడుసుకులా చేసాడు. మొరటోడిలా, కాస్త భయానకంగా ఆయన రూపం ఉండటమే ఇందుకు కారణం. తన తర్వాతి సినిమా 'బాహుబలి' కోసం భారీగా గడ్డం, మీసాలు పెంచిన ప్రభాస్ ఈ విధంగా తయారయ్యాడు.

ఆ మధ్య హీరో గోపీచంద్ పెళ్లికి హాజరైనప్పుడు తన భారీ గడ్డాన్ని, మీసాలను స్టైలిష్‌గా సెట్ చేయించుకుని రాజసం ఉట్టిపడే లుక్‌తో కనిపించిన ప్రభాస్.....ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా, మొరటోడిలా కనిపించాడు. హెయిర్ స్టైల్, మేకప్ హంగులు లేక పోవడం వల్లనే అన్నవరంలో జరిగిన వివాహ వేడుకలో ఇలా కనిపించినట్లు స్పష్టమవుతోంది.

రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం.

ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

అన్నవరంలో తన సన్నిహితుల వివాహానికి ప్రభాస్ హాజరయ్యారు. ప్రభాస్ కుటుంబానికి బాగా కావాల్సిన వారు కావడంతో ఆయన ప్రత్యేకంగా ఈ వేడుకకు హాజరయ్యారు.

రాజమౌళి బాహుబలి సినిమా కోసం భారీగా మీసం, గడ్డం పెంచిన ప్రభాస్.....స్టైలిష్‌గా తయారు కాక పోవడంతో మెరటోడిలా భయపెట్టే లుక్ తో కనిపించాడు.

హైదరాబాద్ నుంచి అన్నవరం వరకు కారులో వెళ్లడం వల్లనే ప్రభాస్ ఫేసు కాస్త అలసట కారణంగా ఇలా కనిపించాడని స్పష్టమవుతోంది

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి' చిత్రం ఓ ల్యాండ్ మార్కుగా నిలవనుంది. అందుకే ఈచిత్రం కోసం చాలా కష్టపడి పని చేస్తున్నాడు ప్రభాస్

గోపీచంద్ వివాహానికి హాజరైన ప్రభాస్ స్టైలిష్‌గా, రాజసం ఉట్టిపడేలా కనిపించారు. అప్పుడు ఆయన లుక్ అందరినీ ఆకట్టుకుంది.

English summary
Prabhas was recently made an appearance at Annavaram for his relative wedding in his new look. The actor's bushy beard, for a role in his upcoming film Baahubali, is sure to surprise many. The unit is currently working on the pre production work uner the supervision of director Rajamouli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu