twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ తాజా సినిమా ఇటలీలో...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... లారెన్స్ దర్శకత్వంలో 'రెబెల్' చిత్రం తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'వారధి' (వర్కింగ్ టైటిల్) అనే చిత్రానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'వారధి' చిత్రం ఇటలీ‌లో తర్వాతి షెడ్యూల్ జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది.

    ఈ షెడ్యూల్‍‌లో ప్రభాస్‌తో హీరోయిన్లు అనుష్క, రీచా గంగోపాధ్యాయపై పాటలు చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈచిత్రం దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు.

    ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి. ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 'వారధి' అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని, అంతకంటే పవర్ ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నామని, ప్రభాస్ ఇమేజ్‌కు తగిన విధంగా మరో మంచి టైటిల్ కోసం వెతుకున్నామని చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు.

    మరో వైపు ప్రభాస్ లారెన్స్ కాంబినేషన్లో రూపొందిన రెబల్ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం ఈ నెల చివరి వారంలో విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు విడుదలైన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు.

    English summary
    Young Rebel Star Prabhas will soon be heading to Italy to shoot for the film ‘Vaaradhi’. A few songs will be canned on Prabhas and the unit will be travelling to Italy in the next few months. Anushka and Richa are playing the female leads in this flick and Koratala Shiva is the director. Shiva is making his debut as a director with this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X