»   » ఫ్రెండు కోసం ప్రభాస్ ప్రమోట్ చేస్తున్నాడు (ఫోటో)

ఫ్రెండు కోసం ప్రభాస్ ప్రమోట్ చేస్తున్నాడు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుధీర్ బాబు , వామిఖ‌లు జంట‌గా నటించిన భ‌లేమంచిరోజు చిత్రాని త‌న బెస్ట్ విషెస్ తెలిపారు బాహుబలి స్టార్ ప్రభాస్. ఈచిత్రం ఫ‌స్ట్ లుక్ చూశాను చాలా కొత్త‌గా అనిపించింది. అలాగే సాంగ్స్ సౌండింగ్ చాలా బాగున్నాయి. ఇప్పటికే అంద‌రూ విని స‌క్స‌స్ చేశారు. ముఖ్యంగా టీజ‌ర్ సూప‌ర్ గా వుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. టీజ‌ర్ చివ‌రిలో వ‌చ్చే డైలాగ్ సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుంది. మా ఫ్రెండ్ విజ‌య్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. యంగ్ టీం మెత్తం చాలా ఇష్ట‌ప‌డి చేశారు డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది. అంద‌రూ త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని దియోట‌ర్స్ లో చూడండి ' అంటూ ప్రభాస్ ప్రమోట్ ఈ సినిమాను చేస్తున్నారు.

'ప్రేమ కథా చిత్రం', సుధీర్‌ బాబు హీరోగా, వామిఖ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం కథాంశం అంతా ఒక్క రోజులో జరిగేది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోద భరితంగా తెరకెక్కుతోంది. 70ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజరు కుమార్‌ రెడ్డి, శశిథర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ ఆధిత్యని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఉత్తమ విలన్‌', 'విశ్వరూపం2' చిత్రాలకి ఛాయాగ్రహణం అందించిన షామ్‌దత్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. సన్ని.ఎమ్‌.ఆర్‌ ఈ చిత్రానికి బాణీలు అందించారు.


Prabhas wishes to Bhale Manchi Roju Team

నిర్మాతలు మాట్లాడుతూ '' ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న సబ్జెక్ట్‌ అనుకున్నట్టుగానే తెరకెక్కించాం. సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. కథ, కథనాలని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సుధీర్‌ బాబు పరకాయ ప్రవేశంలా ఇన్‌వాల్వ్‌ అయ్యి మరీ నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది'' అని అన్నారు.


కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌. ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, పి.ఆర్‌.వో- ఏలూరు శ్రీను, కో-డైర‌క్ట‌ర్- శ్రీరామ్‌ రెడ్డి, నిర్మాత‌లు-విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం- శ్రీరామ్ ఆదిత్య‌.

English summary
Baahubali star Prabhas wishes to Bhale Manchi Roju Team.
Please Wait while comments are loading...