»   »  'ఆగడు' ని 'గోవిందుడు...' కాంపన్ సేట్ చేసాడు

'ఆగడు' ని 'గోవిందుడు...' కాంపన్ సేట్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Prakash Raj: Aagadu Out, Govindudu Andarivadele in
హైదరాబాద్ : రీసెంట్ గా పెద్ద వివాదం జరిగి 'ఆగడు' నుంచి ప్రకాష్ రాజ్ బయిటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బయిటకు వచ్చిన ప్లేస్ లోకి సూనూసూద్ ని తీసుకుని షూట్ చేస్తున్నారు శ్రీను వైట్ల. ఇప్పుడు దాన్ని కాంపన్ సేట్ చేయటానికా అన్నట్లు 'గోవిందుడు అందరి వాడేలే' లో రాజ్ కిరణ్ ని తొలిగించి... ప్రకాష్ రాజ్ కు పాత్ర ఇచ్చారు. దాంతో ఈ విషయం మీడియా సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. గతంలోనూ తనను తీసేసి వేరే వారిని పెట్టుకుని షూట్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... నా పాత్రను ఇంకొకరు చేయడం, వేరేవాళ్లు చేస్తున్న పాత్రని నేను చేయడం.. అనేవి సినిమా రంగంలో సహజమే. అడిగారు. కథ చెప్పారు. పాత్ర చెప్పారు. నచ్చింది. చేస్తున్నా. సినిమాలో ఒకర్ని తీసే హక్కు, ఒకర్ని పెట్టుకునే హక్కు దర్శకులకి ఉంటుంది. దాన్ని మనమేం చేయలేం. అవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. 'నిజం'లో మొదట మురళీమోహన్ చేసిన కేరక్టర్‌ను నేను చేశాను. దర్శకునికి ఒకరు నచ్చకపోతే ఇంకొకర్ని పెట్టుకుంటాడు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మన అవసరాల్ని బట్టే సినిమాలుంటాయి. ఒకరికి నేను కావాలని ఉండదు. ఒకరికి నేను కావాలని ఉంటుంది. ప్రస్తుతం కృష్ణవంశీ సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' చేస్తున్నా అన్నారు.

విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ త్వరలో 'ఉలవచారు బిర్యానీ' అనే చిత్రంతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తన స్వీయదర్శకత్వంలో ధోనీ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రకాష్ రాజ్ ఈ చిత్రంపై మంచి ధీమాగా ఉన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాను తెలుగు తమిళ మరియు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్నాడు.

'ఆకాశమంత', 'ధోని' లాంటి సినిమాలలోని ఏ కళని నమ్మి చేశానో, అలాంటి కళని నమ్మి చేసిన సినిమా 'ఉలవచారు బిర్యాని'. ప్రకాశ్‌రాజ్ సినిమా అంటే జనంలో ఉండే ఎక్స్‌పెక్టేషన్‌కు తగ్గట్లే ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.

ఇది రెండు జంటల చుట్టూ తిరిగే కథ అందులో ప్రకాష్ రాజ్ - స్నేహ ఒక జంటగా, మరొక జంట కోసమే అన్వేషణ అజరుగుతోంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, స్నేహ, ఊర్వశి, సామ్యూక్తా హోర్నాడ్, ఎస్.పి బాలసుబ్రమణ్యం మరియు సిహి కహి చంద్రు ప్రధానపాత్రధారులు. ఈ సినిమా తాను అనుకున్నట్టే అందంగా తెరకెక్కింది అని ప్రకాష్ రాజ్ ఆనందంగా వున్నాడు.

English summary
Recently Prakash Raj has been roped in to Ram Charan starrer Govindudu Andarivadele being directed by creative director Krishnavamsi, earlier Tamil actor Raj Kiran who played father role in Pandem Kodi movie was appointed to play that role but he has been replaced by Prakash Raj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu