twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది హిందూ ఉగ్రవాదం కాక మరేమిటి?: సున్నితమైన అంశంపై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు

    కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలకు మద్దతిస్తూ సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘మతం పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఉగ్రవాదం కాదా?’ అని ఆయన ప్రశ్నించారు

    |

    సినినటులు రాజకీయాల్లోకి రావటం వల్లనా.., లేక నిజంగానే సామజిక స్పృహ పై శ్రద్దపెరిగిందో గానీ ఈ మధ్య సోషల్ ఇష్యూలలో సినినటుల స్పందన బాగానే ఉంటోది. దేశహంలో చోతు చేసుకుంటున్న అసనాన్నీ, ప్రజా సమస్యలనీ ఇంతకుముందుకంటే ఎక్కువగానే పట్టించుకుంటున్నారు. తాజాగా 'ఆనంద వికటన్' అనే తమిళ మ్యాగజైన్‌కు ప్రతి వారం రాసే కాలమ్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి కలకలం రేపాయి. ఒక వర్గం ప్రజలని కొంచం ఘాటుగానే ఇబ్బందిపెట్టాయికూడా ఇప్పుడు అదే క్రమంలో ప్రకాశ్ రాజ్ కూడా చేరాడు ...

     హిందూ అతివాదులు

    హిందూ అతివాదులు

    దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందనీ, దేశంలో హిందూ టెర్రర్ లేదని ఎవరూ చెప్పలేరని కుండ బద్దలుకొట్టారు కమల్ హాసన్ . హిందూ ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని అతివాదులు అంగీకరించి తీరాల్సిందేననీ, గతంలో హిందూ అతివాదులు తమ వాదనలు మాత్రమే వినిపించేవారు.

     ప్రజలకు నమ్మకం పోతోంది

    ప్రజలకు నమ్మకం పోతోంది

    కానీ ఇప్పుడు వారు హింసకు తెగబడుతున్నారు', ‘సత్యమేవ జయతే' అనే నినాదంపై ప్రజలకు నమ్మకం పోతోంది", ‘ఒకప్పుడు సత్యం ఒంటరిగా విజయం సాధించేది. కానీ ఇప్పుడు శక్తి ఒక్కటే గెలుస్తోంది. ఇది ప్రజల్ని అమానుషంగా తయారుచేస్తోంది' కాషాయ దళంలోకి ఉగ్రవాదం వచ్చి చేరింది, దీన్ని వాళ్లు అంగీకరించాల్సిందే.... అని కమల్ తన వ్యాసంలో రాశారు.

    నటుడు ప్రకాశ్‌రాజ్‌

    నటుడు ప్రకాశ్‌రాజ్‌

    అయితే ఈ వ్యాసం చూడగానే కమల్ పై మిశ్రమ స్పందన కనిపించింది. ఒక భారతీయ నటుడివై వుండి ఇంత ధారుణంగా రాస్తావా? అంటూ కొందరూ " కమల్ చెప్పింది నిజమే ఉగ్రవాదం కొత్త రూపంలో తయారవుతోంది" అంటూ మద్దతుగా మరికొందరూ స్పందించారు.. ఇక సినిమా రంగం నుంచే ప్రకాశ్ రాజ్ కూడా కమల్ హాసన్ కి సపోర్ట్ గా నిలబడ్డాడు. కమల్ అన్న వ్యాఖ్యలని తాను సమర్థిస్తున్నట్టె ఒక ట్వీట్ చేసాడు...

     ఉగ్రవాదం కాక మరేమవుతుంది?

    ఉగ్రవాదం కాక మరేమవుతుంది?

    కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలకు మద్దతిస్తూ సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘మతం పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఉగ్రవాదం కాదా?' అని ఆయన ప్రశ్నించారు. ‘మతం పేరుతో ప్రజల మధ్య భయాన్ని వ్యాపింపజేయటం ఉగ్రవాదం కాక మరేమవుతుంది?

     భయాన్ని వ్యాపింపచేయడాన్ని

    భయాన్ని వ్యాపింపచేయడాన్ని

    మతం, సంస్కృతి, నీతినియమం అనే పేర్లతో భయాన్ని వ్యాపింపచేయడాన్ని ఉగ్రవాదం అని పిలువక మరేమని పిలవాలో చెప్పండి' అంటూ ప్రశ్నించారు. ‘నా దేశంలో వీధిలో నడచివెళుతున్న యువజంటపై నీతినియమాల పేరుతో దాడి జరపటం ఉగ్రవాదమే కదా!

     హత్య చేయడం ఉగ్రవాదం కాదా?

    హత్య చేయడం ఉగ్రవాదం కాదా?

    జంతువధకు వెళుతున్నారనే అనుమానంతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడి జరిపి దారుణంగా హత్య చేయడం ఉగ్రవాదం కాదా?' ప్రకాశ్‌రాజ్‌ అని ప్రశ్నించారు. అసంతృప్తవాదులు వెల్లడించే భావాలపై ప్రతివిమర్శలు చేయడమే కాక దూషించడం, బెదిరించడం వంటి చర్యలతో హింసను ప్రేరేపించడం ఉగ్రవాదం కాక మరేమిటో తాను తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.

     నిమిషాల్లోనే వేలాదిమంది మద్దతు

    నిమిషాల్లోనే వేలాదిమంది మద్దతు

    కమల్‌కు అండగా ప్రకాశ్‌రాజ్‌ చేసిన ట్వీట్‌కు కొన్ని నిమిషాల్లోనే వేలాదిమంది మద్దతుగా స్పందించారు. అతం లోకంటే ఈ సారి ప్రకాశ్ రాజ్ కి మద్దతుగా వచ్చిన కామెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉంది, కొందరు హిందూత్వ వాదులు వ్యతిరేకించినా ప్రకాశ్ రాజ్ వాటిని పట్టించుకోలేదు.

    English summary
    “If instilling fear in the name of religion… culture… morality is not terrorising… then what is it. Just asking,” Prakash Raj, who has won several National Awards, said in his tweet which he addressed “to whomsoever it may concern.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X