twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ షాకింగ్ రియాక్షన్.. ఆయన వల్ల ఓడిపోయారు అనే కామెంట్స్ పై స్పందన

    |

    టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం చాలా ఉత్కంఠగా కొనసాగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పాల్గొన్న సినీ నటులు కేవలం మాటలతో కాకుండా గొడవలు కూడా దిగడం అందరినీ ఆశ్చర్యానికి కలిగించాయి. కొంతవరకు ఎన్నికల సమయంలో తోపులాట కూడా జరిగింది అని కూడా ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి ఫలితాల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పై విజయం సాధించాడు. ఇక ఆ ప్రభావం ప్రకాష్ రాజ్ ప్యానల్ పై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ కూడా సభ్యత్వం నుంచి తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆయన ఓటమికి గల కారణాలపై కూడా అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇక నాగబాబు చేసిన కామెంట్స్ పై కూడా ప్రకాష్ రాజ్ సున్నితంగానే స్పందించారు.

     సాదారణ ఎన్నికల తరహాలో..

    సాదారణ ఎన్నికల తరహాలో..

    టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలాకాలం తర్వాత ఎన్నికల హడావిడి ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత కొన్ని వారాలుగా సెలబ్రిటీలు వ్యక్తిగతంగా అనేక రకాల విమర్శలు చేసుకుంటూ ప్రస్తుత రాజకీయాలను తలపించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అయితే సాధారణ ఎన్నికల తరహాలో జరగడం విశేషం. అంతేకాకుండా ఈసారి అత్యధికంగా ఓట్లు కూడా పోలైనట్లు కమిటీ సభ్యులు వివరణ ఇచ్చారు.

    వంద ఓట్ల మెజారిటీతో

    వంద ఓట్ల మెజారిటీతో

    మొదట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవి కోసం ఐదు మంది పోటీలోకి నిలువగా ఆ తర్వాత ప్రకాష్ రాజు , మంచు విష్ణు ఇద్దరు మాత్రమే ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల భరిలో నిలిచారు. అసలైతే ఏకగ్రీవంగానే మా అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అనుకున్నారు. కానీ భిన్న అభిప్రాయాలు రావడంతో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ఇద్దరు కూడా పోటీ పడడానికి సిద్ధమయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజు పై మంచు విష్ణు వంద ఓట్లకు పైగా మెజారిటీతో విజయం

    ప్రకాష్ రాజ్ రాజీనామా

    ప్రకాష్ రాజ్ రాజీనామా

    ఇక ప్రకాశ్ రాజ్ సోమవారం రోజు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తెలుగు వ్యక్తి మాత్రమే అధ్యక్షుడు గా ఉండాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తాను ఈ కమిటీలో ఉండడం అవసరమని అనిపించిందని అందుకే రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు వివరణ ఇచ్చారు. ఇక అందరూ అనుకుంటున్నట్లు ఓడిపోయినందుకు మాత్రమే నేను రాజీనామా చేయడం లేదని కూడా ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు.

    నాగబాబు చేసిన వ్యాఖ్యలు

    నాగబాబు చేసిన వ్యాఖ్యలు

    ఇక ఇటీవల నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రకాష్ ఓటమికి కారణమైనట్లు అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.. మంచు విష్ణు పై అలాగే వారి ప్యానెల్ లో ఉండే ఇతర సభ్యులపై కూడా నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎన్నికలపై ప్రభావం చూపించాయి. అంతేకాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన చేసిన కామెంట్స్ తీవ్రస్థాయిలో అభ్యంతరం కలిగించాయని అందుకే ప్రకాష్ రాజు ఓడిపోయారు అని కూడా అన్నా

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    ఎవరు ఏం చెప్పినా..

    ఎవరు ఏం చెప్పినా..

    నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎవరు ఏం చెప్పినా కూడా మెంబర్స్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. మెంబర్స్ ఎవరికి ఓటేయాలి అనుకుంటే వాళ్లకే ఓటు వేస్తారు. అయినా ఇది నాగబాబును ఓడించడం కాదు కదా. నాగబాబు ఒక్కరి వల్లే నేను గెలిచే అవకాశం లేదు కదా. ఎవరు ఏం చెప్పినా కూడా ఎన్నుకున్న మెంబర్స్ వారి వ్యక్తిగతం గా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఎవరో ఒకరు ఫలితాలపై బాధ్యులు అవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదని వివరణ ఇచ్చారు.

    English summary
    Prakash raj reaction on nagababu comments on maa elections results,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X