twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు: వాళ్లెక్కడ ఈయన ఎక్కడ అంటూ దారుణంగా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఎంత పేరు ఉంటుందో.. విలన్ పాత్రలు పోషించే వారికి సైతం అంతే గుర్తింపు ఉంటుంది. అప్పట్లో చాలా మంది ఈ పాత్రలకు వన్నె తీసుకు వచ్చారు. ఈ జాబితాలోకే వస్తాడు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో మెప్పించిన ఆయన.. ఉత్తమ నటనతో ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. గతంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన... ఈ మధ్య పాలిటిక్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం.!

    వాళ్ల తర్వాత ప్రకాశ్ రాజ్‌ మాత్రమే అలా

    వాళ్ల తర్వాత ప్రకాశ్ రాజ్‌ మాత్రమే అలా

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది విలన్ పాత్రలు పోషించారు. వారిలో రాజనాల, ఎస్వీ రంగారావు, రావు గోపాల రావు, కైకాల సత్యనారాయణ వంటి వారు సత్తా చాటగా.. ఇప్పుడు సినిమాకో విలన్ పుట్టుకొస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్రసీమలో విలక్షణ నటనతో విలనిజం పండిస్తూ, ఎన్నో సినిమాల్లో అత్యుత్తమ నటనను కనబరిచాడు ప్రకాశ్ రాజ్.

     జస్ట్ ఆస్కింగ్ అంటూ మొదలు పెట్టాడు

    జస్ట్ ఆస్కింగ్ అంటూ మొదలు పెట్టాడు

    వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ప్రకాశ్ రాజ్ సమాజంలో జరిగే విషయాలన్నింటిపై స్పందిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత ఆయన ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, #justasking అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆయనకు ఊహించని రీతిలో మద్దతు లభించింది.

     పొలిటికల్ ఎంట్రీ.. ఎన్నికల్లో పరాభవం

    పొలిటికల్ ఎంట్రీ.. ఎన్నికల్లో పరాభవం

    సమాజంలో ఎలాంటి సంఘటనలు జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించేవారు ప్రకాశ్ రాజ్. ఈ క్రమంలోనే 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బెంగళూర్ సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 2.5 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో ఘోర పరాభవం ఎదురైంది. దీంతో డిపాజిట్ కూడా కోల్పోయారు.

    తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌పై కామెంట్స్

    తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌పై కామెంట్స్

    సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రకాశ్ రాజ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా స్పందిస్తున్నారు. ఒకానొక దశలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన పెదవి విరిచిన ఆయన.. తెలంగాణలో పాలన బాగుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

     పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు

    పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు

    జీహెఎంసీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో ప్రకాశ్ తెలంగాణ రాజకీయాలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పూటకో రకంగా మాట మార్చే పవన్ ఒక ఊసరవెల్లిలా కనిపిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో పార్టీకి మద్దతు తెలపడం వల్ల ఆయన స్ట్రాటజీపై అనుమానాలు వస్తున్నాయి' అని పేర్కొన్నారు.

    Recommended Video

    Raj Tarun New Movie Will Be Directed By Santo
    వాళ్లెక్కడ ఈయన ఎక్కడ అని కామెంట్

    వాళ్లెక్కడ ఈయన ఎక్కడ అని కామెంట్

    ఏపీ పాలిటిక్స్‌ను ఉదహరిస్తూ ‘2014లో పవన్.. మోదీకి మద్దతు తెలిపాడు. ఆ తర్వాత విమర్శించాడు. ఇప్పుడు మళ్లీ ఆయనకు జై కొడుతున్నాడు. అసలు ఏపీలో బీజేపీకి ఓట్లు వస్తాయా. ఒక శాతం ఓట్లు సాధించే వాళ్లు ఎక్కడ? పవన్ ఎక్కడ? పోయి పోయి వాళ్లతో పొత్తు పెట్టుకుంటాడా? ఒక పార్టీ అధినేత అయి ఉండి వేరే పార్టీ పంచన చేరుతాడా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

    English summary
    Prakash Raj is an Indian film actor, director, producer, thespian, television presenter, activist and politician who is known for his works in the South Indian film industry, and Hindi-language films. He acted in back-to-back stage shows for ₹300 a month in the initial stages of his career, when he joined Kalakshetra, Bengaluru, and he has 2,000 street theatre performances to his credit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X