Don't Miss!
- News
బాలకృష్ణను వీడని వివాదాలు: కొని తెచ్చుకున్న మరో కాంట్రవర్సీ
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రూపాయి విలువ నా ఇన్నర్ వేర్.. జుహీ చావ్లా, బాలీవుడ్ స్టార్స్ ట్వీట్స్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో బిన్నంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం పై ఆయన గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా జస్ట్ ఆస్కింగ్ అంటూ ఊహించని విధంగా సెటైర్స్ వేస్తున్నారు. ఇక గతంలో ఉన్న ప్రభుత్వంపై నెగిటివ్ అంశాలపై బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు సైతం ఎంతగానో విమర్శించారు అంటూ ఇప్పుడు మాత్రం అలాంటి తప్పులు జరుగుతున్నా కూడా పెద్దగా స్పందించడం లేదు అని కొంతమంది ప్రముఖులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ క్రమంలో అదే విషయంపై పెద్దగా చర్చ లేకుండానే ప్రకాష్ రాజు ఒక సెటైర్ అయితే వేశాడు. గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపున అందుకున్న స్టార్ సెలబ్రిటీలు చేసిన కామెంట్లను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఒకానొక సమయంలో మన కంట్రీలో ఈ విధంగా స్పందించారు అని జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు.

అందులో కాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి అలాగే ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, శిల్పా శెట్టి, జూహి చావ్లా, అమితాబ్ బచ్చన్ కూడా గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను గుర్తు చేశారు. ముఖ్యంగా వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ ను టాప్ ప్లేస్ లో ఉంచారు. మీ సంతోషం పెట్రోల్ ధరలో తరహాలో పెరగాలి.. అలాగే మీ బాధలు ఇండియన్ రూపీలాగా తగ్గాలి. అలాగే మీ హృదయం కరప్షన్ తరహాలో జాయ్ తో నిండిపోవాలి అని ఆయన సెటైర్ వేసిన విధానం అప్పట్లో వైరల్ అయింది.
అదే తరహాలో శిల్పా శెట్టి డాలర్ రేటు పెరుగుతూ ఉండడం పై కూడా సెటైర్ వేసింది. అమితాబ్ బచ్చన్ కూడా రూపీ కి సరికొత్త అర్థం చెబుతూ సెటైర్ వేశారు. ఇక ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ రూపీ వాల్యూ తగ్గిపోవడం పై కూడా వివాదాస్పదంగానే వివరణ ఇచ్చారు. ఇంకా మరో ప్రముఖ సెలబ్రెటీ జూహి చావ్లా అయితే రూపాయి విలువ ను ఒక ఇన్నర్ వేర్ తో పోల్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఇక ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక స్టార్స్ అందరూ కూడా 2012, 2013 కాలంలోనే ఈ ట్వీట్స్ చేశారు. మరి ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చిన విధానంపై ఆ స్టార్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.