»   »  నా కల నిజమైన రోజు.. రిపబ్లిక్ డే రోజున ప్రకాశ్ రాజ్ ఏం చేశాడో తెలుసా

నా కల నిజమైన రోజు.. రిపబ్లిక్ డే రోజున ప్రకాశ్ రాజ్ ఏం చేశాడో తెలుసా

Posted By:
Subscribe to Filmibeat Telugu

జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకొన్నా.. సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇస్తేనే అందులో ఆనందం ఉంటుందని నిరూపించారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. రిపబ్లిక్ డే సందర్భంగా తాను దత్తత తీసుకొన్న పాలమూరు జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నా కల వాస్తవ రూపం దాల్చిన రోజు. నాకు ఇది నిజమైన రిపబ్లిక్ డే'అని అన్నారు.

 Prakash Raj visits Kondareddypalli of Mahaboob Nagar

గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ మరమత్తులు చేసిన పాఠశాల భవనంలో విద్యార్థులు, గ్రామస్తులతో మాట్లాడారు. చదువులో ప్రతిభ చూపిన పిల్లలకు బహుమతులను అందేజేశారు.

 Prakash Raj visits Kondareddypalli of Mahaboob Nagar

ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకొన్నారు. 'ప్రజలతో భాగమవ్వడం, వారి ఆనందంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశారు. గతంలో పాలమూరు జిల్లా కొండారెడ్డి గ్రామాన్ని ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకొన్న సంగతి తెలిసిందే.

English summary
Prakash Raj says Dreams coming true while visiting his adopted village
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu