»   » మోహన్ లాల్ కొడుకు హీరోగా ఎంట్రీ, ఇతడే.. (ఫోటోస్)

మోహన్ లాల్ కొడుకు హీరోగా ఎంట్రీ, ఇతడే.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ త్వరలో తన వారసుడిని హీరోగా వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మోహన్ లాల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

'తన కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో థ్రిల్లర్‌ కథాంశంతో ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్న చిత్రంలో మావాడు కథానాయకుడిగా చేయబోతున్నాడు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఈ సినిమా రాబోతోంది' అని మోహన్‌లాల్‌ ట్వీట్‌ చేశారు.

తండ్రికి తగ్గ తనయుడే

తండ్రికి తగ్గ తనయుడే

నటనలో ప్రణవ్ తండ్రికి తగ్గ తనయుడే. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా కొన్ని సినిమాలు చేసాడు. అందులో పునర్జని అనే సినిమాలో నటనకు గాను 2002లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా అందుకున్నాడు.

కసిమీదున్న కుర్రోడు

కసిమీదున్న కుర్రోడు

ప్రణవ్ మంచి కసిమీద ఉన్న కుర్రోడు. చిన్నతనం నుండే సినిమాలంటే ఆసక్తి. వయసు 26. సరైన వయసు, సమయం చూసి ఎంట్రీ ఇస్తున్నాడు. పణవ్ ఎంట్రీపై మోహన్ లాల్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.

చవును నిర్లక్ష్యం చేయలేదు

చవును నిర్లక్ష్యం చేయలేదు

నటన మోజులో పడి ప్రణవ్ చదువు నిర్లక్ష్యం చేయలేదు. ఊటీలో స్కూలింగ్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీ నుండి బిఎ ఫిలాసఫీలో డిగ్రీ పట్టాపొందాడు.

లో ప్రొఫైల్

లో ప్రొఫైల్

ప్రణవ్ చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటాడు. సూపర్ స్టార్ కొడుకునే అనే గర్వం అతడికి లేదని, స్టార్ వారసుడిగా కాకుండా...తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల, కసి అతనిలో ఉందని ప్రణవ్ సన్నిహితులంటుంటారు.

దుల్కర్ కు పోటీ ఇస్తాడా?

దుల్కర్ కు పోటీ ఇస్తాడా?

ఆల్రెడీ మరో సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ప్రణవ్ అతడికి ఏమేరకు పోటీ ఇస్తాడు అనేది కేరళ సినీ అభిమానుల్లో చర్చనీయాంశం అయింది.

English summary
"Pranav Mohanlal is ready to begin his career as n actor in a thriller movie directed by Jeethu Joseph and production under Aashirvad Cinemas" Mohanlal tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu