»   » రిస్కీ వ్యాపారం లో లాభాలు: రెండో బ్రాంచ్ తెరిచిన ప్రణీత

రిస్కీ వ్యాపారం లో లాభాలు: రెండో బ్రాంచ్ తెరిచిన ప్రణీత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకి ముందు చూపు కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే సినిమాల ద్వారా తాము సంపాదిస్తున మొత్తాన్ని రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. మార్కెట్‌లో ఉన్నంతవరకు సంపాదించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న హీరోయిన్స్.. నటనతో పాటు బిజినెస్‌ను క్యాష్ చేసుకుంటారు. సంపాదించుకున్న డబ్బును రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు ఏం చేసినా అది అందర్నీ ఆకట్టుకుంటుంది. వాళ్లకున్న క్రేజ్ అలాంటిది. కన్నడ సుందరి ప్రణీత సైతం పోయిన సంవత్సరం ఈ జభితాలోకి చేరిపోయింది.ఇంతకీ ప్రణీత చేస్తున్న బిజినెస్ ఏమిటో తెలుసా..???

వ్యాపార రంగంలోకి

వ్యాపార రంగంలోకి

అయితే, మేల్ డామినేషన్ ఉన్న రంగాల్లోనూ కొంతమంది కథా నాయికలు అడుగుపెట్టి, జేజేలు అందుకుంటున్నారు. ఇప్పటికే తమన్నా చేస్తున్న ‘వైట్ అండ్ గోల్డ్' నగల వ్యాపారానికి బోల్డంత డిమాండ్ ఉంది. చెల్లెలు షగున్‌తో కలిసి తాప్సీ చేస్తున్న వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కాజల్, నిషా అగర్వాల్ చేస్తున్న ‘మార్ సాలా' నగల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల చందంగా ఉందట. ఈ క్రమంలో కొంతమంది తారలు వ్యాపార రంగంలోకి దిగుతున్నారు.

డాన్సింగ్ పబ్

డాన్సింగ్ పబ్

ముందుగా తాను ఒక రెస్టారెంట్ ప్రారంబిస్తున్నాననే చెప్పింది ప్రణీత తర్వాతే అందరికీ అది మామూలు రెస్టారెంట్ కాదనీ అది డాన్సింగ్ పబ్ అని తర్వాత తెలిసింది. దాదాపుగా ఇలాంటి వ్యాపారాలు ఇప్పటివరకూ మేల్ నటులు మాత్రమే చేసారు. హీరోయిన్ లూ నటీమణులు కాస్త రిస్క్ తక్కువ వున్న బిజినెస్ లలో మాత్రమే పాలుపంచుకున్నారు

రిస్క్ వ్యాపారాన్నే

రిస్క్ వ్యాపారాన్నే

కానీ ప్రణీత మాత్రం కాసింత ధైర్యం చేసి ఈ రిస్క్ వ్యాపారాన్నే దిగ్విజయంగా చేసేస్తోంది. ఓ ఏడాది క్రితం బెంగళూరులో పబ్ ప్రారంభింంచింది ప్రణీత. అప్పట్లో అందరికీ రెస్టారెంట్ అంటూ కలరింగ్ ఇచ్చింది కానీ.. ఆ తర్వాత అసలు విషయం ఒప్పుకోక తప్పలేదు.

మరో ఫ్రాంచైజీ కూడా

మరో ఫ్రాంచైజీ కూడా

ఇప్పుడా పబ్ మూడు డ్రింకులు.. ఆరు కాక్ టైల్స్ అంటూ సూపర్బ్ గా నడిచేస్తోంది. దీంతో ఇందిరానగర్ లో ఇప్పుడు మరో ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ చేసేసింది ప్రణీత. మొదటి పబ్ లో ప్లేస్ సమస్యలు ఎదుర్కున్నామని.. అందుకే తాజాగా ప్రారంభించిన పబ్ ను విశాలంగా ఉండేలా డిజైన్ చేశామని చెప్పిందీ భామ.

సలహాలు ఇచ్చారట

సలహాలు ఇచ్చారట

మొదట్లో పబ్ వ్యాపారం అనగానే ఇంట్లో అందరూ కాస్త జంకారట మామూలుగా ఉండే మరేదైనా బిజినెస్ చూసుకోవచ్చు కదా అంటూ సలహాలు ఇచ్చారట కానీ తాను మాత్రం అలా భయపడలేదనీ, . తాను మొండిపట్టు పట్టడంతో ఒప్పుకున్న వారు.. ఇప్పుడు వ్యాపారం బాగా జరగడానికి సహకరిస్తున్నారట కూడా.

మరో అడుగు ముందుకు

మరో అడుగు ముందుకు

తాను ఇంతగా సక్సెస్ కావడానికి రీజన్ వాళ్ల సపోర్టే అంటోంది ప్రణీత. మొత్తానికి నటన లోనే ఉండిపోయి సంపాదించేసుకుందాం అన్న పాత తరహా ఆలోచనలనుంచి వ్యాపారరంగం లోకి వచ్చిన హీరోయిన్ల ఆలోచహనలని మరో అడుగు ముందుకువేయించింది ప్రణీత.

English summary
Pranitha started a pub in Bangalore last year. The pub business said to have clicked so well that she is getting ready to start a second franchisee in Indira Nagar
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu