»   » చెత్త సినిమాలతో టార్చర్ పెడుతున్న దర్శకుడి అరెస్ట్!

చెత్త సినిమాలతో టార్చర్ పెడుతున్న దర్శకుడి అరెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మల్టీ టాలెంటెడ్ బాలీవుడ్ దర్శకుడు, స్క్రిప్టు రైటర్, నటుడు సాజిద్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసారు. హిమ్మత్ వాలా, హమ్ షకల్స్ లాంటి చెత్త సినిమాలు తీసి ప్రేక్షకులను టార్చర్ పెట్టడమే ఇందుకు కారణం. అయితే మాత్రం అరెస్టు చేస్తారా? అనే సందేహం మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఇదంతా ఉత్తుత్తి అరెస్టే...

ఇదంతా కావాలని క్రియేట్ చేసిన సంఘటన. సాజిద్ ఖాన్ తనపై తానే ఇలాంటి సెటర్ వేసుకుని ఈ ఫోటో తీయించుకున్నాడు. దీన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నాడు. ‘నా చివరి రెండు చిత్రాల కారణంగా ఫైనల్ గా నేను అరెస్టు అయ్యాను' అంటూ ఫోటో ట్వీట్ చేసాడు.

ఉమాంగ్ 2016 అవార్డుల కార్యక్రమానికి సాజిద్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ ఫోటో తీసారు. చాలా ఫన్నీగా ఉంది కదూ సాజిద్ ఖాన్ ఐడియా. నిజ జీవితంలో కూడా చెత్త సినిమాలు తీసి ప్రేక్షకులను టార్చర్ పెట్టే దర్శకులను అరెస్టు చేస్తే ఎంత బావుంటుందో కదూ!

English summary
‘Finally arrested for my last two films host n dost's entry on stage at the police show’ Sajid Khan tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu