»   » పాఠశాలలో ఉన్న రోజుల్లోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాను: యువహీరో లేఖ

పాఠశాలలో ఉన్న రోజుల్లోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాను: యువహీరో లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్లో పలువురు హీరోలు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు, సింగర్లకు ఎక్సైజ్ శాఖ నోటీసులు అందించడంతో తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది.టాలీవుడ్ ఇప్పుడు పైకి కనిపించని ఆందోళన లో ఉంది ఎప్పుడూ వివాదాస్పద అంశాలతో ఉంటూనే ఉంటుంది ఏ సినీ పరిశ్రమ అయినా అయితే టాలీవుడ్ కొంత వేరు...

బాలీవుడ్ మాదిరి మాఫియాలు గానీ తమిళ, మళయాల ఇండస్ట్రీలల్లో ఉండే రౌడీఇజం గానీ ఇక్కడ కనిపించేవి కాదు. ఇక ఇప్పుడు మారిన పరిస్థితిలో టాలీవుడ్ నటులు బయట పడకున్నా బాలీవుడ్ లో మాత్రం ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. మొన్నటికి మొన్న మున్నాభాయ్ సంజయ్ దత్ తన స్కూల్ టైమ్ లోనే డ్రగ్స్ కి అలవాటు పడ్డానని చెప్పగా ఇప్పుడు ఇంకో యువనటుడు ఇదే విషయాన్ని కది పాడు.

ప్రతీక్ బబ్బర్

ప్రతీక్ బబ్బర్

టాలీవుడ్ లో కలకలం రెగుతున్న ఈ నేపధ్యంలో బాలీవుడ్ నటుడు డ్రగ్స్ వినియోగం పై స్పందించాడు. లెజెండరీ యాక్టర్స్ రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ ల కుమారుడు ప్రతీక్ బబ్బర్ ఏక్ దివానా థా సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతీక్ ' రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ లాంటి లెజెండ్ కడుపున పుట్టానే గాని, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

పాఠశాలలో ఉన్న రోజుల్లోనే

పాఠశాలలో ఉన్న రోజుల్లోనే

అందరికీ నేను ప్రతీక్‌ బబ్బర్‌లాగే తెలుసు. కానీ నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియదు. పాఠశాలలో ఉన్న రోజుల్లోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాను. కానీ ఇప్పుడు మనిషిగా వాటన్నింటినీ జయించాను. డ్రగ్స్‌ జీవితం ఎలా నాశనమవుతుంది? వాటి నుంచి ఎలా బయటపడాలి? అన్న విషయాలు మీతో పంచుకుంటున్నా...

13 ఏళ్ల వయసులో

13 ఏళ్ల వయసులో

13 ఏళ్ల వయసులో ఏదో తెలియని బాధతో ఇబ్బంది పడేవాడిని. సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు వేదించేవి. దీంతో నా మనసు డ్రగ్స్‌వైపు మళ్లింది. ఎలాంటి డ్రగ్ అయినా ఆలోచించకుండా వాడేవాడిని. ఒక దశలో పూర్తిగా డ్రగ్ ఎడిక్ట్ గా మారిపోయా. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను వేలెత్తి చూపుతారిని భయపడేవాడిని, నన్ను నేను కూడా చూసుకునేందుకు భయపడేవాడిని.

Puri Jagannath daughter reacted over Drugs Rumor on Her Father
జీవితం నాశనం చేసుకోవటం కన్నా

జీవితం నాశనం చేసుకోవటం కన్నా

మానేయాలన్న ఆలోచన వచ్చినా.. నా వల్ల అయ్యేది కాదు. చివరకు డాక్టర్లు నా సమస్యకు పరిష్కారం చూపించారు. జీవితం నాశనం చేసుకోవటం కన్నా.. కష్టపడి డ్రగ్స్ వాడకాన్ని మానేయటం కరెక్ట్' అంటూ తన అనుభవాలను అభిమానులకు వివరించాడు ప్రతీక్ బబ్బర్.

English summary
Prateik Babbar, who debuted with Jaane Tu Ya Jaane Na, and did films like Dhobi Ghat and Aarakshan, has written a powerful note on drug addiction.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu