»   » చొక్కా పట్టుకుని నిలదీసిన హీరోయిన్ చార్మి (ఫోటోలు)

చొక్కా పట్టుకుని నిలదీసిన హీరోయిన్ చార్మి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చరితచిత్ర పతాకంపై చార్మి కీలకపాత్రధారిణిగా తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రతిఘటన'. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశరాజధాని ఢిల్లీలో జరిగి నిర్భయ ఘనటను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈచిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసారు. ఇందులో చార్మి పోలీసు చొక్క పట్టుకున్నట్లు ఉంది. ఆ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుందని స్పష్టమవుతోంది. సినిమా గురించి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...'మహిళలకు రక్షణలేని నేటి సమాజం స్థితిగతులకూ, నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందని' తెలిపారు.

ఈచిత్రంలో చార్మి మహిళా జర్నలిస్టుగా నటిస్తోంది. అత్యాచార బాధితురాలి పాత్రలో రేష్మ నటిస్తోంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

ప్రతిఘటన

ప్రతిఘటన


గతంలో తెలుగులో విజయశాంతి ప్రధాన పాత్రలో ఓ ‘ప్రతిఘటన' సినిమా వచ్చింది. ఇపుడు అదే పేరుతో మరో సినిమా వస్తున్నప్పటకీ.......ఇవి కథాపరంగా పూర్తిగా విభిన్నమైన చిత్రాలు.

చార్మి

చార్మి


ఇప్పటికే మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో చార్మి నటించింది. వాటి మాదిరిగానే ‘ప్రతిఘటన' చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే.

మంచి పేరొస్తుందంటున్న చార్మి

మంచి పేరొస్తుందంటున్న చార్మి


ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని చార్మి ఎంతో నమ్మకంగా ఉంది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని, నేటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు.

జర్నలిస్టు పాత్రలో చార్మి

జర్నలిస్టు పాత్రలో చార్మి


గతంలో నగరం నిద్రపోతున్న వేళ చిత్రంలో జర్నలిస్టుగా నటించిన చార్మి...ప్రతిఘటన చిత్రంలో కూడా జర్నలిస్టుగా కనిపించబోతోంది.

ఉచితంగా పని చేస్తున్నారు

ఉచితంగా పని చేస్తున్నారు


సందేశాత్మక సబ్జెక్టు కావడంతో సంగీత దర్శకులు కీరవాణి. నియర్‌ కెమెరామెన్‌ ఎస్‌.గోపాల్‌రెడ్డితో పాటు చార్మి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట.

English summary
Prathighatana movie shooting completed. The movie based on Nirbhaya incident is coming up with Charmi in the lead role. Tamma Reddy Bharadwaja is directing the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu