ప్రెగ్నెంట్ హీరోయిన్ అండర్ వాటర్ బికినీ ఫోటో షూట్, ఆశ్చర్య పరిచే భంగిమల్లో...
Recommended Video
నటి సమీరా రెడ్డి త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలు సమీరా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆమె స్పెషల్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ఇది మామూలు ఫోటో షూట్ అయితే ఇంత చర్చ జరిగేది కాదు. నిండు గర్భిణి అయిన సమీరా... అండర్ వాటర్ ఫోటో షూట్లో పాల్గొన్నారు. వివిధ రంగుల్లో బికినీలు ధరించి అందమైన భంగిమల్లో ఫోజులు ఇవ్వడం ఇంటర్నెట్లో వైరల్ అయింది. తన 9వ నెల ప్రెగ్నెన్సీని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ ఫోటో షూట్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు.

అండర్ వాటర్లో ఫోటో షూట్ చేయాలనుకున్నపుడు కాస్త భయం కలిగింది
‘9వ నెల ప్రెగ్నెన్సీ సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన వచ్చినపుడు విభిన్నంగా, అందంగా ఉండాలని అనుకున్నాను. అండర్ వాటర్లో ఫోటో షూట్ చేయాలనుకున్నపుడు కాస్త భయం కలిగింది. అందుకే ఎంతో జాగ్రత్తగా దీన్ని ప్లాన్ చేయడం జరింది. ఈ ఫోటోలు అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉంది.' అని సమీరా రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవి నేను గర్వపడే ఫోటోలు
ఈ ఫోటోలు అన్నీ కూడా ఎలాంటి ఫిల్టర్స్ వాడకుండా, మేకప్ టచప్ లేకుండా, ఫోటోషాప్‌లో ఎడిట్ చేయకుండా ఫోస్ట్ చేయడం గర్వంగా ఉంది. ఇవి చాలా పర్ఫెక్టుగా వచ్చాయని భావిస్తున్నాను. ఈ ఫోటో షూట్ నా మూడ్ మరింత పాజిటివ్‌గా మారేలా చేసింది. ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది అని సమీరా రెడ్డి తెలిపారు.

ఆమె నీరు.. మిమ్మల్ని ముంచేంత శక్తివంతమైనది
తన పింక్ బికినీ ఫోటోపై సమీర్ రెడ్డి కామెంట్ చేస్తూ... ‘ఆమె నీరు. మిమ్మల్ని ముంచేంత శక్తివంతమైనది, మిమ్మల్ని శుభ్రపరిచేంత మృదువైనది, మిమ్మల్ని రక్షించేంత లోతైనది.' అంటూ కవితాత్మకంగా వ్యాఖ్యానించారు. సమీరా రెడ్డి పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఆమెను విష్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో
సమీరా రెడ్డి మరో పోస్టులో తన ఫస్ట్ చైల్డ్ ఫోటో షేర్ చేశారు. 2015లో జన్మించిన తన బాబు 2019 నాటికి ఎంత ఎదిగిపోయాడో అనే విషయాన్ని తలుచుకుంటూ మురిసిపోయారు. సమీరా రెడ్డి తన ప్రియుడు అక్షయ్ వాద్రాను 2014లో పెళ్లాడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











