»   » మొత్తానికి పెళ్లి విషయమై స్పందించింది

మొత్తానికి పెళ్లి విషయమై స్పందించింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: నిన్న మొన్నటి వరకూ నాకా ..పెళ్లా అంటూ పెళ్లి విషయం ఎత్తిన మీడియాపై మండిపడే ప్రీతిజింతా చివరకు కూల్ అయ్యింది. తన పెళ్లి విషయమై సానుకూలంగా స్పందించింది. తన ప్రియుడు జీన్‌ గుడ్‌ఇనో(అమెరికా)ను లాస్‌ఏంజిల్స్‌లో వివాహం చేసుకున్న మాట నిజమేనని ఆమె వెల్లడించింది.

I was holding on the " Miss Tag" rather seriously till now, until I met someone " Goodenough" to give it up for 󾌬 So now...

Posted by Real Preity Zinta on5 March 2016

మొన్నటివరకు మిస్‌ ప్రీతిగా ఉన్న తాను ఇప్పుడు ‘మిసెస్‌ గుడ్‌ఇనో' అయ్యా.. అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు, స్నేహితులు, అభిమానులకు ట్విట్టర్‌ , ఫేసు బుక్ ఖాతాల ద్వారా పేరుపేరునా ధన్యవాదాలు చెప్పింది ప్రీతి.

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన అమెరికా బాయ్ ఫ్రెండ్ జీని గుడెనఫ్ ను లాస్ ఏంజిల్స్ లో పెళ్లాడింది. అయితే ఈ వివాహం మీడియాకు తెలియకుండా రహస్యంగా జరుపుకోవడం గమనార్హం.

ప్రీతి జింతా క్లోజ్ ఫ్రెండ్స్ సుజానె ఖాన్(హృతిక్‌ రోషన్ మాజీ భార్య), సురిలీ గోయెల్ వివాహానికి హాజరయ్యారు. పెళ్లి రహస్యంగా చేసుకున్నా రిసెప్షన్ మాత్రం తన హోదాకు తగిన విధంగా గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Preity Zinta confirms she is married to Gene Goodenough

పెళ్లి తర్వాత నెల రోజుల పాటు అమెరికాలోనే హనీమూన్ ఎంజాయ్ చేయడానికి ఈ జంట ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. హనీమూన్ ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో బాలీవుడ్ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీని గడెనఫ్ తో ప్రీతి జింతా గత 18 నెలలుగా డేటింగ్ చేస్తోంది.

English summary
Preity Zinta shared in fB: "I was holding on the " Miss Tag" rather seriously till now, until I met someone " Goodenough" to give it up for 😘 So now I join the Married Club folks ❤💋😍 Thank you all for your good wishes & for all your love🙏 Love you all ❤ Ting ! 🇮🇳🇺🇸 Let the Goodenough jokes begin 😜"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu