»   » ప్రీతి జింతా అమెరికన్ బాయ్ ఫ్రెండును పెళ్లాడబోతోందా?

ప్రీతి జింతా అమెరికన్ బాయ్ ఫ్రెండును పెళ్లాడబోతోందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతా చుట్టూ ఎప్పుడూ ఎఫైర్ వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. గతంలో అమ్మడి గురించి ఎన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పంజాబ్ జట్టు సహయాజమాని నెస్‌వాడియా, డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌సింగ్‌లతో ప్రీతి గతంలో ప్రేమాయణం సాగించిన వార్తలు గతంలో బోలెడు విన్నాం.

తన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నాడని ఇటీవల ప్రీతిజింతా వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఆమె సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ తో కలిసి ముంబైలో ఓ రెస్టారెంటుకు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైనట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

Preity Zinta to tie knot in Jan'16?

తాజాగా మరో కొత్త గాసిప్ తెరపైకి వచ్చింది. త్వరలో ప్రీతి జింతా పెళ్లాడబోతోందని, అమెరికన్ బాయ్ ఫ్రెండ్ గినె‌ను 2016 జనవరిలో పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం గినె ఆమె బాయ్ ఫ్రెండ్ కాదు, ఒక మంచి స్నేహితుడు మాత్రమే. ప్రీతి బ్రదర్, లిటిస్ నైసీ అమెరికాలో నివసిస్తున్నారని, వారిని కలిసేందుకు ఆమె రెగ్యులర్ గా అమెరికా వెలుతుంది. ఈ సందర్భంలో ఆమెకు అక్కడ స్నేహితులు ఏర్పడ్డారు. అలాంటి స్నేహితుల్లో ఒకరే గినె అని మరికొందరు అంటున్నారు.

ప్రీతి జింతా చుట్టూ ఇలాంటి వార్తలు మామూలే. ఈ వార్తలను బాలీవుడ్ జనాలు ఎప్పటిలాగే లైట్ తీసుకుంటున్నారు. ప్రీతి జింతా స్వయంగా ఆమె పెళ్లి విషయం బయట పెడితే తప్ప ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. 40 ఏళ్ల వయసున్న సుందరిని పెళ్లాడే వాడు ఎక్కడున్నాడో? ఏమో?

English summary
The wedding season has certainly set in. And if the latest buzz is anything to go by, the Bollywood’s dimpled beauty Preity Zinta is all set to enter matrimony with her American boyfriend.
Please Wait while comments are loading...