»   » వావ్... 3 రోజుల్లో 100 కోట్లు వసూళ్లు!

వావ్... 3 రోజుల్లో 100 కోట్లు వసూళ్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటించిన ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజే బాక్సాఫీసు వద్ద చిత్రం రూ.40 కోట్ల కలెక్షన్ వసూలు చేయగా 3 రోజుల్లో రూ. 100 కోట్ల మార్కును అందుకుంది.

 Prem Ratan Dhan Payo joined in 100 cr club

బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్‌ ఆదర్శ్‌ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' 3 రోజుల కలెక్షన్ వివరాలు వెల్లడించారు. 2015లో రూ. 100 కోట్లు వసూలు చేసిన 5వ సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో'. ఇంతకు ముందు బజరంగీ భాయిజాన్, తను వెడ్స్ మను, బాహుబలి(హిందీ), ఎబిసిడి2 చిత్రాలు 100 కోట్లు వసూలు చేసిన జాబితాలో ఉన్నాయి అని తెలిపారు.

ఇక సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా రూపొందిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' ప్రపంచ వ్యాప్తంగా 5,300 థియేటర్లలో గురువారం విడుదలైంది. భారత్‌లోనే 4,500పైగా థియేటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 800 థియేటర్లలో చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలీల' పేరుతో విడుదల చేశారు. తెలుగులో సల్మాన్‌ఖాన్‌కు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ విశేషం.

సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'ను తెరకెక్కించారు. విడుదలకు ముందే సంగీతం, శాటిలైట్‌ హక్కుల అమ్మకం ద్వారా రూ.57 కోట్లు ఆదాయం వచ్చింది. హిమేష్‌ రేష్మియా స్వరపరిచిన గీతాలకు మంచి స్పందన వస్తోంది. సంగీతం హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో ఇప్పటివరకు ఈ చిత్రానిదే రికార్డు.

English summary
"Prem Ratan Dhan Payo is the 5th film in 2015 to enter ₹ 100 cr club, after #BajrangiBhaijaan, #TWMR, #Baahubali [Hindi], #ABCD2. Hindi films." Taran Adarsh tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu