»   » సల్మాన్ ఖాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ (ట్రైలర్)

సల్మాన్ ఖాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ హై కౌన్ చిత్రాలను భారతీయులు ఎప్పటికి మరిచిపోలేరు. ఆ చిత్రాల్లో ప్రేమ్ గా సల్మాన్ అందరి మనస్సులో గుర్తుండిపోయేలా లవ్ లీగా చేసేసి భారతావనని తన ప్రేమ కథలతో ఊపేసాడు. అయితే ఆ చిత్ర దర్శకుడుతో ఆయన మళ్లీ చిత్రం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.

బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వంలో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

సల్మాన్‌తోపాటు సోనమ్‌ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే భజరంగీ బాయ్‌జాన్ సినిమా తో సల్లూభాయ్ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

గతంలో సల్మాన్‌ఖాన్‌తో దర్శకుడు సూరజ్‌ బర్‌జాత్యా మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై,హమ్ ఆప్ కే కౌన్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తీశాడు. ఈ కాంబినేషన్ తాజాగా నాలుగోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

English summary
Salman Khan starrer Prem Ratan Dhan Payo official trailer is out! As super excited as we are to watch this much awaited movie trailer, the makers have made sure to not give any hint of the story in this trailer.
Please Wait while comments are loading...