»   » రామ్ చరణ్ డబ్బింగ్ చెప్తున్న 'ప్రేమలీల' ట్రైలర్ (వీడియో)

రామ్ చరణ్ డబ్బింగ్ చెప్తున్న 'ప్రేమలీల' ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

‌ముంబై: బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'. ఈ చిత్రాన్ని తెలుగులోకి ప్రేమ లీల టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ ని, ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. ఆ రెండిటిని ఇక్కడ చూడండి.

సుప్రసిద్ధ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్‌ సల్మాన్‌ఖాన్‌తో రూపొందించిన ‘మైనే ప్యార్‌ కియా' చిత్రం ‘ప్రేమపావురాలు' పేరుతో.. ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌' ‘ప్రేమాలయం' పేరుతో తెలుగులో విడుదలై ఇక్కడ కూడా అసాధారణ విజయాలు సొంతం చేసుకోవడం తెలిసిందే.

రాజశ్రీ సంస్థ తాజాగా సల్మాన్‌ఖాన్‌తో హిందీలో రూపొందిస్తున్న ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' తెలుగులో ‘ప్రేమలీల' పేరుతో అనువాదమవుతోంది. హిందీతోపాటు తెలుగులోనూ నవంబర్‌ 12న విడుదలవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రామ్‌చరణ్‌ వాయిస్‌ ఇస్తుండడం విశేషం.

 Prem Ratan Dhan Payo telugu version Prema Leela Official Trailer

సల్మాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన రామ్‌చరణ్‌.. ‘ప్రేమలీల' చిత్రంలో సల్మాన్ ఖాన్ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడంతో ఈ చిత్రానికి గల క్రేజ్‌ మరింత పెరుగుతోంది. సూరజ్‌ బరజాత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ సరసన సోనమ్‌ కపూర్‌ నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విజయ దశమి కానుకగా విడుదల చేసారు.

తమ సంస్థ నుంచి వచ్చిన ‘ప్రేమ పావురాలు, ప్రేమాలయం' చిత్రాల కోవలో ‘ప్రేమ లీల' కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూలూ గిస్తుందని సూరజ్ బరజాత్య అంటున్నారు. ఇటీవలే ఈ చిత్రం డబ్బింగ్‌ను రామ్‌చరణ్‌ పూర్తి చేసారు. నవంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుద కానుంది.

 Prem Ratan Dhan Payo telugu version Prema Leela Official Trailer

నీల్ నితీన్ దేశ్ముఖ్, అనుపమ్ ఖేర్, స్వర భాస్కర్, సంజయ్ మిశ్రా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిమేష్ రేష్మియా, నేపధ్య సంగీతం: సంజయ్ చౌదరి, చాయాగ్రహణం: వి.మణికందన్, కూర్పు: సంజయ్ సంక్ల, పంపిణీ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, నిర్మాణం: రాజశ్రీ ప్రొడక్షన్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సూరజ్ బరజాత్య!

English summary
Trailer of bollywood movie Prem Ratan Dhan Payo telugu dubbed movie starring Salman Khan and Sonam Kapoor in lead roles released. Ram charan will be dubbing for salman.Trailer with That version will come soon. In Theaters 12th Nov.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu