»   » ‘ప్రేమకథా చిత్రమ్’50: కృష్ణ, మహేష్ హ్యాపీ

‘ప్రేమకథా చిత్రమ్’50: కృష్ణ, మహేష్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రేమకథా చిత్రమ్ భారీ విజయం సాధించడంతో కృష్ణ, హహేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారని హీరో సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మారుతి మీడియా హౌస్ రూపొందించిన 'ప్రేమకథా చిత్రమ్' విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఫంక్షన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ... 'ప్రేమకథా చిత్రమ్ విజయవంతం కావడంతో నా బాధ్యత మరింత పెరిగింది. సినిమా విజయం పట్ల మామయ్య కృష్ణతో పాటు, మహేష్ బాబుకు కూడా ఆనందంగా ఉన్నారు. మహేష్ బాబు సినిమా విజయవంతం అయినప్పుడు కృష్ణగారు ఎంత సంతోషంగా ఫీలవుతారు ఇప్పుడు నా విషయంలోనే అదే విధంగా ఫీలవుతున్నారు. నాకు ఇంత పెద్ద విజయం అందించిన అందిరికీ కృతజ్ఞతలు' అని తెలిపారు.

మారుతి మాట్లాడుతూ...'సుధీర్ బాబు వల్లనే ఈ సినిమా తెరకెక్కింది. నేను రెండు కథలు చెబితే ఆయన దీన్నే ఒకే చేసారు. నందిత పెర్ఫార్మెన్స్ సినిమాకు కీలకంగా మారింది. ఆమె కోసమే పాత్ర నిడివి పెంచాను.ఇండియా మొత్తం మీద ఎక్కువ రేటుకు రీమేక్ హక్కులు పొందిన చిత్రమని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళంలో కాశీ విశ్వనాథ్ రీమేక్ చేస్తున్నారు' అని తెలిపారు.

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ....సినిమా ఇప్పటికే 66 రోజులు పూర్తయిందని, త్వరలో 100 రోజులు పూర్తి చేసుకోబోతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, సి.కళ్యాణ్, లగడపాటి శ్రీధర్, ఎంఎస్ రాజు, స్వామి, సురేస్ కొండేటి, కాశీవిశ్వనాథ్ హాజయ్యారు.

English summary

 Prema Katha Chitram movie has completed 50 days run. Prema Katha Chitram is a 2013 Telugu film produced by Maruthi and Sudarshan Reddy, and directed by J. Prabhakar Reddy, who worked as a cinematographer for Ee Rojullo and Bus Stop, which were directed by Maruthi. It stars Sudheer Babu and Nanditha in the Lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu