»   » ప్రీమియర్ షో టాక్: ఛల్ మోహన్ రంగ.. క్లీన్ కామెడీతో అదరగొట్టారు!

ప్రీమియర్ షో టాక్: ఛల్ మోహన్ రంగ.. క్లీన్ కామెడీతో అదరగొట్టారు!

Subscribe to Filmibeat Telugu

నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ చిత్రం మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహనిర్మాతలుగా ఛల్ మోహన్ రంగ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్ర పాటలు, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అదే పాజిటివ్ బజ్ తో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోల ప్రదర్శన జరిగింది. చిత్రం ఎలా ఉంది, ప్రేక్షకుల స్పందన ఏంటి, నితిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తన 25 వ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉందా లేదా ఇప్పుడు చూద్దాం!

Chal Mohan Ranga Movie Twitter Review 'ఛల్ మోహన్ రంగ' ట్విట్టర్ రివ్యూ
నితిన్ 25 వ చిత్రం

నితిన్ 25 వ చిత్రం

నితిన్ తన కెరీర్ లో అనేక జయాపజయాలని ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. తాజాగా నితిన్ తన 25 వ చిత్రం ఛల్ మోహన్ రంగతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


 పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మాణంలో

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మాణంలో

నితిన్ 25 వ చిత్రం కావడం అదే సమయంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఈ చిత్రానికి నిర్మాతలుగా మారడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకున్న ఆడియో, ట్రైలర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.
యూఎస్‌లో పూర్తయిన ప్రీమియర్ షోలు

యూఎస్‌లో పూర్తయిన ప్రీమియర్ షోలు

మంచి అంచనాల నడుమ ఛల్ మోహన్ రంగ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షో లని ప్రదర్శించారు. ప్రీమియర్ షోనుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
కామెడీ ఆయుధంగా

కామెడీ ఆయుధంగా

ఈ చిత్రం ఆద్యంతం క్లీన్ కామెడీతో అలరించింది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ప్రధాన ఆయుధంగా దర్శకుడు కృష్ణ చైతన్య చిత్రాన్ని నడిపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూల్ గా సాగుతుంది.


నితిన్, మేఘా ఆకాష్ అదుర్స్ అనిపించేలా

నితిన్, మేఘా ఆకాష్ అదుర్స్ అనిపించేలా

నితిన్, మేఘా ఆకాష్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్ లో వీరి మధ్య సన్నివేశాలు బాగా పండాయి. సినిమా చివరి వరకు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే విధంగా సాగింది.


ఇంటర్వెల్ లో ట్విస్ట్

ఇంటర్వెల్ లో ట్విస్ట్

సరదాగా సాగిన ప్రేమ సన్నివేశాల తరువాత నితిన్, మేఘా ఆకాష్ ఇంటర్వెల్ లో విడిపోతారు. ఈ టిస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అమెరికాలోనే సాగుతుంది.


డల్ అయిన సెకండ్ హాఫ్

డల్ అయిన సెకండ్ హాఫ్

కూల్ గా సాగిన ఫస్ట్ హాఫ్ తరువాత సెకండ్ హాఫ్ ఆరంభంలో కొన్ని సన్నివేశాలు సాదా సీదాగా ఉంటాయి. సినిమా గ్రాఫ్ పడిపోకుండా దర్శకుడు కృష్ణ చైతన్య కామెడీ సన్నివేశాలతో ఎంటర్టైన్ చేసాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఉంది.


క్లీన్ కామెడీ ఎంటర్టైనర్

క్లీన్ కామెడీ ఎంటర్టైనర్

ఓవరాల్ గా నితిన్ 25 వ చిత్రంగా వచ్చిన ఛల్ మోహన్ రంగ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. కథ విషయంలో ఎక్కువ అసలు పెట్టుకోకుండా వెళితే రెండున్నర గంటల పాటు క్లీన్ కామెడీని ఎంజాయ్ చేసి రావచ్చు.
త్రివిక్రమ్ తరహాలో

త్రివిక్రమ్ తరహాలో

ఈ చిత్రానికి మూల కథని త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. సినిమా డైలాగుల్లో త్రివిక్రమ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో డైలాగులు కూడా మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.


తమన్ సంగీతం

తమన్ సంగీతం

తమన్ సాంగ్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యాగ్ గ్రౌండ్ సంగీతం విషయంలో తమన్ తన పనితనాన్ని కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్ ఎలివేట్ చేసేలా తమన్ సంగీతం ఆకట్టుకుంది.


ప్రతి ప్రేమ్ అందంగా

ప్రతి ప్రేమ్ అందంగా

ఛల్ మోహన్ రంగ చిత్రానికి మరోబలం సినిమాటోగ్రఫీ. ఈ చిత్రానికి నటరాజన్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రాఫర్. నితిన్ అ..ఆ చిత్రానికి కూడా ఆయనే సినిమాటోగ్రఫీ అందించారు. ఛల్ మోహన్ రంగలో ప్రతి సన్నివేశం అందంగా కనిపించడంలో ఆయన పనితనం కనిపిస్తుంది.


English summary
Premier show talk of Nithin Chal Mohan Ranga movie. Chal Mohan Ranga Will going to be Clean Comedy entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X