»   » మహేశ్‌బాబు చేతుల మీదుగా... సితార లాంచ్

మహేశ్‌బాబు చేతుల మీదుగా... సితార లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న విన్నర్ చిత్రంలోని పాటను ప్రిన్స్ మహేశ్ బాబు బుధవారం తన సోషల్ మీడియా పేజీల ద్వారా విడుదల చేయనున్నారు. దర్శకుడు మలినేని గోపిచంద్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మురగదాస్ చిత్రంలో నటిస్తున్న మహేశ్ .. ఆ చిత్ర షూటింగ్ లొకేషన్ నుంచి విన్నర్ సినిమాలోని పాటను రిలీజ్ చేయనున్నారు.

Prince Mahesh babu to launch the winner song sithara

విన్నర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది. తమన్ సంగీతం అందించిన ఆడియోను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మహేశ్‌తో ఓ పాటను విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రిన్స్ ముద్దుల కూతురు పేరు కూడా సితార కావడం గమనార్హం.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహేశ్‌బాబుకు సాయిధరమ్ తేజ్, తమన్ ట్వీట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు. సహృదయుడైన మహేశ్ పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

English summary
Prince Mahesh babu to release the Winner song on social media today, for this Thaman, Sai Dharam tej say thanks to the Price.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu