»   » స్పైడర్ టైటిల్ అదిరింది.. మహేశ్ ఫ్యాన్స్‌లో జోష్.. సోషల్ మీడియాలో హల్‌చల్..

స్పైడర్ టైటిల్ అదిరింది.. మహేశ్ ఫ్యాన్స్‌లో జోష్.. సోషల్ మీడియాలో హల్‌చల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ చిత్రానికి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. స్పైడర్, ఏజెంట్ గోపి, సంభవామి తదితర పేర్లపై జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ స్పైడర్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ ఖరారుతో పాటు ఫస్ట్‌లుక్ కూడా అదింరిందనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతున్నది. ఫస్ట్‌లుక్ విడుదల కాగానే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా

మహేశ్‌బాబు స్పైడర్ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ స్టూడెంట్‌ పాత్రను పోషిస్తున్నది. ఖుషీ దర్శకుడు సూర్య విలన్‌గా కనిపిస్తారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 23న తమిళ, తెలుగు భాషల్లో విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది.

వియత్నాంలో హాలీవుడ్ స్టాయిలో ఫైట్స్

వియత్నాంలో హాలీవుడ్ స్టాయిలో ఫైట్స్

స్పైడర్ చిత్రంలో కీలకమైన యాక్షన్ పార్ట్‌ను హాలీవుడ్ స్ఠాయిలో వియత్నంలో రెండు వారాలపాటు చిత్రీకరించారు. వియత్నాంలో దక్షిణాది చిత్రం షూటింగ్ జరుపుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు జయం రవి నటించిన వనమాగన్ చిత్రాన్ని వియత్నాంలో షూట్ చేశారు. సినీ పరిశ్రమలో కనీవిని ఎరుగని రీతిలో యాక్షన్ సీన్లను, ప్రధానంగా ఛేజింగ్ సీన్లను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీన్లకు వియత్నాంకు చెందిన స్థానిక ఫైట్ మాస్టర్ రూపకల్పన చేయడం విశేషం.

రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు..

రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు..

స్పైడర్ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కుల విషయంలో కూడా బిజినెస్ రికార్డు స్థాయి వంద కోట్లకు పైగా జరిగే అవకాశం కనిపిస్తున్నది. తెలుగు, హిందీ శాటిలైట్ హక్కుల రూపంలో సుమారు రూ.26 కోట్లు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తున్నది. 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే మహేశ్ కెరీర్‌లోనే భారీగా బిజినెస్ జరిగిన సినిమాగా రికార్డులకు ఎక్కుతుంది.

150 కోట్ల మేర బిజినెస్..

150 కోట్ల మేర బిజినెస్..

సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్‌కు ముందే దాదాపు రూ.150 కోట్ల బిజినెస్ జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ కాకముందే బిజినెస్ పూర్తయినట్టు ఫిలింనగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రా, సీడెడ్ హక్కులు రూ.36 కోట్లు, నైజాం ఏరియా రూ.20 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది.

English summary
After long waiting Prince Maheshbabu, AR Murugadoos movie title revealed and First look released. Maheshbabu latest movie title is spyder. This title gets huge positive response from Fans and movie lovers. This movie is slated to release on June 23rd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu