»   » ‘మహేశ్‌’కు జియో డెడ్‌లైన్.. ఆందోళనలో అభిమానులు..

‘మహేశ్‌’కు జియో డెడ్‌లైన్.. ఆందోళనలో అభిమానులు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేశ్‌బాబు అభిమానులకు ఇప్పుడు జియో డెడ్‌లైన్ గడువు భయం పట్టుకొన్నది. మార్చి 31నుంచి ఉచితంగా డేటా ఇచ్చేది లేదని జియో డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే జియోకు, మహేశ్ అభిమానుల భయానికి ఏమిటి సంబంధం అనుకొంటున్నారా.

మార్చి 31 ముందే ట్రైలర్

మార్చి 31 ముందే ట్రైలర్

దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ట్రైలర్‌ను ఒకవేళ మార్చి 31కి ముందు విడుదల చేయకపోతే రికార్డు స్థాయి హిట్స్ కోల్పోయే ప్రమాదముందని మహేశ్ అభిమానులు హెచ్చరిస్తున్నారట. ఈ మేరకు చిత్ర నిర్మాతపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

జియో ఫ్రీ సిమ్స్, డేటా

జియో ఫ్రీ సిమ్స్, డేటా

గత మూడు నెలలుగా జియో ఉచితంగా సిమ్స్ సప్లై చేసి ఫ్రీ డాటా ఇచ్చింది. దీంతో తెలుగు చిత్రాల ట్రైలర్లకు, పాటలకు బాగా రికార్డు వ్యూస్ వచ్చాయి. ఒక్కరోజులోనే బాహుబలి ట్రైలర్‌కు నెటిజన్లు బ్రహ్మరధం పట్టారు.

తెలుగు చిత్రాలకు రికార్డు వ్యూస్

తెలుగు చిత్రాలకు రికార్డు వ్యూస్

జనవరి నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి, దువ్వాడ జగన్నాథం, కాటమరాయుడు, బాహుబలి2 చిత్రాల ట్రైలర్లను రికార్డు స్థాయిలో నెటిజన్లు వీక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే ఎక్కువగా హిట్స్ వచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు.

 ప్రిన్స్, నిర్మాతపై ఒత్తిడి

ప్రిన్స్, నిర్మాతపై ఒత్తిడి

మార్చి 31వ తేదీ నుంచి జియో ఉచిత డేటా ఇవ్వడాన్ని నిలిపివేస్తున్న నేపథ్యంలో రానున్న మహేశ్ బాబు చిత్ర టైలర్, ఫస్ట్ లుక్ ఇబ్బందిగా మారే అవకాశముందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నరట. ఈ నేపథ్యంలో మార్చి 31కి ముందే ట్రైలర్‌ను, టైటిల్‌ను విడుదల చేయాలని ప్రిన్స్‌, నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారట.

English summary
Prince Maheshbabu Fans Worry Over Jio Tele network Deadline. This has been worrying Mahesh Babu's fans. Their argument is that if the first teaser doesn't come before March 31st, they will be losing record views. So, they are criticising producers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu