»   » స్పైడర్ టీజర్ రిలీజ్ మరోసారి వాయిదా.. విషాదంలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్!

స్పైడర్ టీజర్ రిలీజ్ మరోసారి వాయిదా.. విషాదంలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు మురగదాస్ డైరెక్షన్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు నటిస్తున్న స్పైడ‌ర్ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం వాయిదా పడింది. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని స్పైడర్ టీజర్‌ను రిలీజ్ చేయాలని ముందుగా నిర్ణయించారు. ఊహించిన విధంగా దాసరి మృతి చోటుచేసుకోవడంతో తమ నిర్ణయాన్ని మార్చుకొన్నారు.

బర్త్‌డే వేడుకలకు దూరంగా కృష్ణ

బర్త్‌డే వేడుకలకు దూరంగా కృష్ణ

తెలుగు పరిశ్రమకు తిరుగులేని విజయాలు అందించిన సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం మే 31. కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని మహేశ్ బాబు నటిస్తున్న స్పైడర్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మే 31 తేదీ సాయంత్రం 5గం.లకు టీజ‌ర్ విడుద‌ల కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. కాని ద‌ర్శ‌కర‌త్న దాసరి మృతికి సంతాప సూచ‌కంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల‌ని వాయిదా వేశామని వారు పేర్కొన్నారు.


జూన్ 1న టీజర్ విడుదల

జూన్ 1న టీజర్ విడుదల

స్పైడర్ చిత్ర టీజర్‌ను తిరిగి జూన్ 1 ఉద‌యం 10.30ని.ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దర్శక దిగ్గజం సూప‌ర్‌స్టార్ కృష్ణ కూడా త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌కి దూరంగా ఉన్నాడు. కృష్ణ, మహేశ్‌బాబుతోపాటు కుటుంబ సభ్యులు దాసరి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దాసరి మృతికి సంతాపాన్ని వారు వ్యక్తం చేశారు. ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ కూడా దాస‌రికి నివాళులు అర్పించారు.


దసరా కానుకగా స్పైడర్

దసరా కానుకగా స్పైడర్

వాస్తవానికి స్పైడ‌ర్ చిత్రాన్ని తొలుత జూన్ 23వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. దాంతో సల్మాన్ ఖాన్ ట్యూబ్‌లైట్ చిత్రాన్ని మహేశ్ ఢీకొట్టబోతున్నారంటూ జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అయితే స్పైడర్ చిత్రం రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ద‌సరా కానుక‌గా సెప్టెంబ‌ర్ 22 న విడుద‌ల చేయనున్న‌ట్టు స‌మాచారం.


స్పైడర్‌కు బాహుబలి టీమ్

స్పైడర్‌కు బాహుబలి టీమ్

స్పైడర్ విడుదల వాయిదా పడటానికి కారణం సాంకేతిక సమస్యలే కారణమని తెలిసింది. వంద కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా స్పైడర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గ్రాఫిక్, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో స్పైడర్‌ను వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ చిత్రం కోసం బాహుబలి గ్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌ను రంగంలోకి దించినట్టు వార్తలు వెలువడ్డాయి.English summary
Tollywood star Mahesh Babu’s upcoming bilingual movie teaser postponed due to legendary director Dasari Narayana Rao. Actually movie makers wants release Spider release on superstar Krishna's birthday. Sudden demise of Dasari casuses teaser postponed. Reports suggest that this movie is set release on september 22.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu