»   » ఫోన్ కోసం సెర్చింగ్ (‘వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌’ ప్రివ్యూ)

ఫోన్ కోసం సెర్చింగ్ (‘వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌’ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోగా ప్రిన్స్ ఇప్పుడు అసలు క్రేజ్ లేదనే చెప్పాలి. ఈ నేపధ్యంలో సంపూర్ణేష్ బాబు వంటివారి ప్యాడింగ్ పెట్టుకుని కామెడీ చేస్తూ దిగుతున్నాడు. ఆసక్తకరమైన టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం తమకు మళ్లీ మంచి రోజులు తెచ్చిపెడతాయని నమ్ముతున్నాడు. డాన్‌ ఘంటసాల అనే పాత్రలో సంపూర్ణేశ్‌బాబు నవ్వులు పూయిస్తాడు. అతని కేరక్టర్‌ సినిమాకు బాగా ప్లస్సవుతుంది. అలాగే సప్తగిరి కూడా బాగా నవ్విస్తాడు అని హామీ ఇస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కథలో ..జీవితాన్ని ఎంజాయ్ చేయటం కోసం తల్లి తండ్రులనుంచి విడిపోయి..పిజ్జా సెంటర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతూంటాడు ప్రిన్స్. అయితే ఒకానొక సందర్భంలో ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు వెనక ఓ మనిస్టర్, ఓ డాక్టర్ ఉంటారు. వాళ్లు ఎలాగయినా ప్రిన్స్ ని కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తూంటారు. మరి ప్రిన్స్ ఆ కేసు నుంచి ఎలా బయిటపడ్డారు. ప్రిన్స్ కు పోలీస్ అధికారి నీలకంఠ(ఆశిష్ విద్యార్ది) ఎలా సహాయపడ్డాడు..అసలు ప్రిన్స్ ఎందుకు మర్డర్ కేసులో ఇరికించాలనుకున్నారు....విద్యాబాలన్ కు కథకు సంభంధం ఏమిటీ అనేది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఫొటో ఉన్న ఫొన్‌ ఒకటి ఉంటుంది. అదే ఇందులో కీ రోల్‌ పోషిస్తుంది. ఆ ఫోన్‌కి, ఫొటోకి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది ఆసక్తికరం. ఇది క్రైమ్‌ మేళవించిన కామెడీ సినిమా. కొంతకాలంగా మానవత్వం నేపథ్యంలో సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆధారంగా చేసుకొని తయారు చేసుకున్న కథ ఇది. ఒకరికి జీవితాన్ని అందించే మంచి పనిని కొంతమంది స్వార్థపరులు చెడుకు ఉపయోగించుకుంటే ఎలాంటి పరిణామాలు సంభవించాయనే అంశాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా చూపించామని చెప్తున్నారు.

Prince's 'Where is Vidya Balan?' movie preview

దర్శకుడు మాట్లాడుతూ... ‘‘విద్యాబాలన్‌ జీవితానికి సంబంధించిన కథ కాదిది. ఈ సినిమాలో విద్యాబాలన్‌ ఎవరు? అసలు తనెక్కడుంటుంది? ఆమె కోసం వెదికేది ఎవరు? అనేది తెరపైనే చూడాలి'' అని అన్నారు.

హీరో ప్రిన్స్ మాట్లాడుతూ...‘ఇందులో పిజ్జా డెలివరీ బాయ్‌గా నటించాను. అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనరిది. నాకు కొత్త జోనర్‌ సినిమా అవుతుంది. కొన్ని కథలు విన్నప్పుడు ఒకలా ఉంటాయి. తెరపై చూస్తే మరోలా ఉంటాయి. ప్రజంటేషన్‌లో తేడా ఉంటే అలా అనిపిస్తుందని నేను అనుకుంటాను. ఈ సినిమాకు మాత్రం అన్ని సమపాళ్లల్లో కుదిరాయి. డాన్‌ పాత్రలో సంపూర్ణేశ్‌బాబు అలరిస్తాడు. కామెడీ కథలో భాగంగా ఉంటుంది కానీ బలవంతంగా ఇరికించినట్టు ఎక్కడా అనిపించదు. నేను చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్‌ సినిమా అవుతుంది. ఈ సినిమాతో దర్శకుడికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది'' అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘క్రైం, కామెడీ నేపథ్యంలో సాగే చిత్రమిది. టైటిల్‌కి తగ్గట్టే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. విద్యాబాలన్‌ కోసం ఎవరు, ఎందుకు వెతుకుతున్నారనేది ఉత్కంఠకరంగా తెరకెక్కించాం. ఇందులో ప్రిన్స్‌ పిజ్జా డెలివరీ బాయ్‌గా కనిపిస్తాడు'' అని అన్నారు.

బ్యానర్ :శ్రీభ్రమరాంబ క్రియేషన్స్‌ నటీనటులు: ప్రిన్స్‌, జ్యోతిసేథీ , జెన్నిఫర్‌, జయప్రకాశ్‌రెడ్డి, సంపూర్ణేశ్‌బాబు, రావు రమేశ్‌, ఆశిష్‌ విద్యార్థి, మధునందన్‌ తదితరులు
కెమెరా: చిట్టిబాబు,
సంగీతం: కమ్రాన్‌,
ఎడిటింగ్‌: మధు,
సమర్పణ: కృష్ణ బద్రి, శ్రీధర్‌రెడ్డి.
నిర్మాతలు: ఎల్‌.వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మినరసింహరెడ్డి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రాగ

English summary
Where is Vidya Balan?...Curiously titled, this film is a comedy thriller directed by Srinivas Raga who previously made Katha . The film stars a gamut of comedy actors including Sapthagiri, Sampoornesh Babu and Thagubothu Ramesh.
Please Wait while comments are loading...