»   » మహేష్‌బాబు ‘స్పైడర్’కు తెలంగాణ సెగ.. షూటింగ్‌ రద్దు

మహేష్‌బాబు ‘స్పైడర్’కు తెలంగాణ సెగ.. షూటింగ్‌ రద్దు

Written By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు, ఏఆర్ మురుగదాస్, ప్రిన్స్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న స్పైడర్‌కు అన్ని అడ్డంకులే ఎదురువుతున్నాయి. సాంకేతిక అంశాల కారణంగా రిలీజ్ డేట్ ముందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా స్పైడర్ షూటింగ్‌కు తెలంగాణవాదుల నుంచి ఆటంకం ఎదురయ్యింది. దాంతో షూటింగ్ రద్దు చేసుకొని మరో ప్రదేశం ఎంపికపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది.

అడ్డుకొన్న యువ తెలంగాణ

అడ్డుకొన్న యువ తెలంగాణ

వాస్తవానికి శనివారం నుంచి యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని నిమ్స్‌ హాస్పటిల్‌లో ప్రిన్స్ మహేష్‌ స్పైడర్‌ షూటింగ్‌ జరుగాల్సి ఉంది. నిమ్స్‌ భవన సముదాయంలో వైద్యసేవలు ప్రారంభించడంలో ప్రభుత్వ
నిర్లక్ష్యాన్ని యువ తెలంగాణ సంస్థ దుయ్యబట్టింది. వైద్య సేవలు అందించాల్సిన హాస్పిటల్‌ను షూటింగ్‌లకు ఇస్తారా అని అభ్యంతరం వ్యక్తం చేసింది.


సీఎం కేసీఆర్‌ను అడ్డుకొంటాం..

సీఎం కేసీఆర్‌ను అడ్డుకొంటాం..

జిట్టా బాలకృష్టారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. జూలై నాటికి నిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాకుంటే ఈ ప్రాంత పర్యటనకొచ్చే సీఎం కేసీఆర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. పేద ప్రజల వైద్య సేవల కోసం నిర్మించిన హాస్పిటల్‌లో షూటింగ్ చేస్తే అడ్డుకొంటామని యువ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ జిట్టా బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన నిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించారు. బీబీనగర్ నిమ్స్ హాస్పిటల్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు.


హెచ్చరికల నేపథ్యంలో..

హెచ్చరికల నేపథ్యంలో..

యువ తెలంగాణ హెచ్చరికల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు గతంలో ఇచ్చిన అనుమతులను నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ రద్దు చేశారు. కాగా అనుమతి రద్దు చేయడంతో షూటింగ్‌ను రద్దు చేసుకుని, సామాగ్రిని చిత్ర యూనిట్ అక్కడి నుంచి తరలించారు.


ప్రిన్ కెరీర్‌లో..

ప్రిన్ కెరీర్‌లో..

ప్రిన్స్ మహేశ్‌బాబు కెరీర్‌లోనే స్పైడర్ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మహేశ్ ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రిన్స్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ జూన్ 23 తేదీ నుంచి ఆగస్టుకు వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం సెప్టెంబర్ వరకు వెళ్ల వచ్చనే టాక్ వినిపిస్తున్నది.English summary
Yuva Telangana leaders abducted Prince Maheshbabu's Spider Shooting at NIMS hospital of Bibinagar. Some the leader opposed to shoot hospital premises. So NIMS director asked to film unit to cancel the shooting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu