»   » నటుడు పృథ్వీ రాజ్ ‘సూసైడ్’ వీడియో సంచలనం

నటుడు పృథ్వీ రాజ్ ‘సూసైడ్’ వీడియో సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దక్షిణాది నటుడు బబ్లూ పృథ్వీ రాజ్‌కు చెందిన 'సూసైడ్' వీడియో సోషల్ మీడియాలో సంచలనంలా వ్యాపిస్తోంది. అయితే ఈ వీడియోలో పృథ్వీరాజ్ తొలుత చేతి మనికట్టు చాకుతో కోసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్లు కనిపించడంతో అంతా షాకయ్యారు. అయితే ఇది ఆత్మహత్యలు అరికట్టడానికి, అవగాహన కల్పించడానికి తీసిన వీడియో అని చివర్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

6 నిమిషాల 50 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో ఆత్మహత్యలు వద్దు, సూసైడ్ సమస్యలకు పరిష్కారం కాదు అనే సందేశం ఇచ్చారు. ఈ మధ్య కాలంతో టీవీ రంగానికి ప్రత్యూష బెనర్జీ, తమిళ టీవీ నటుడు సాయి ప్రశాంత్ ఆత్మహత్యలకు పాల్పడ్డ నేపథ్యంలో ఇలాంటి మళ్లీ జరుగకుండా, అలాంటి ఆలోచనలు ఉన్న వారిలో అవగాహన కల్పించడానికి ఈ వీడియో రూపొందించారు.

వీడియో చివర్లో...మీ స్కిర్ పేపర్ కాదు...దానిని కట్ చేయొద్దు, మీ ముఖం మాస్క్ కాదు... దాన్ని దాచొద్దు, మీ జీవితం సినిమా కాదు..దాన్ని ముగించొద్దు. అంటూ సందేశం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారిలో బ్రతుకుపై ఆశ కల్పించేలా, వారిని అలాంటి ఆలోచనల నుండి బయటకు వచ్చేలా వీడియో రూపొందించడంపై అందరి నుండి ప్రశంసలు అందుతున్నాయి.

English summary
There's been a lot of false rumours going around a WhatsApp audio and the industry has recently been traumatized by a wave of talented individuals resorting to the painful option of taking their own life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu