»   » ఈ టాలెంట్ కూడా ఉందా? మరోసారి ఇంటర్నెట్‌ను ఊపేసిన ప్రియా వారియర్!

ఈ టాలెంట్ కూడా ఉందా? మరోసారి ఇంటర్నెట్‌ను ఊపేసిన ప్రియా వారియర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఈ టాలెంట్ కూడా ఉందా? మరోసారి ఇంటర్నెట్‌ను ఊపేసిన ప్రియా వారియర్!

కన్నుగీటే వీడియోతో మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్నెట్‌లో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఒక్క వీడియోతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. దేశ వ్యాప్తంగా ప్రియా వారియర్ గురించి మీడియాలో చర్చ సాగింది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య అమాతం పెరిగిపోయింది. దీంతో ఆమె నటిస్తున్న మలయాళ చిత్రం ఓరు అడార్ లవ్ చిత్రానికి మంచి పబ్లిసిటీ వచ్చింది. తాజాగా మరోసారి ప్రియా వారియర్ ఇంటర్నెట్‌ను ఊపేసింది.

ప్రియా వారియర్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా?

ప్రియా వారియర్ పాడిన హిందీ సాంగ్, మలయాళ సాంగ్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అమ్మడులో ఈ టాలెంట్ కూడా ఉందా? అంటూ ఆమె అభిమనులు ఆశ్చర్యపోతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

ప్రియా వారియర్‌ కొంతకాలం సంగీతం కూడా నేర్చుకుందట. అందుకే పాటలను ఎంతోబాగా పాడగలుగుతోంది. ఆమె డబ్ స్మాష్ వీడియోలు, టీవీ షోలలో ఆమె పాడిన పాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రియా సింగింగ్ స్కిల్స్ చూసి బిత్తరపోయారు

ఇటీవల ఓ మలయాళం రియాల్టీ షోలో ఆమో ఓ సాంగ్ పాడారు. ప్రొఫెషనల్ సింగర్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ప్రియా వారియర్ అదరగొట్టారు. ఆమె సింగింగ్ స్కిల్స్ చూసి ప్రేక్షకులు, అభిమానులు బిత్తరపోయారు.

భారీ ఆఫర్లు

భారీ ఆఫర్లు

ఒకే ఒక్క వీడియోతో ఓవర్ నైట్ సెన్సేషన్ కావడంతో.... ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన తొలి చిత్రం ‘ఓరు అడార్ లవ్' విడుదలకు ముందే ఆమెకు మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలో ఆఫర్స్ వల్లువెత్తుతున్నాయి.

English summary
Priya Prakash Varrier recently appeared in a Malayalam reality show where she performed Azhalinte Azhangalil from the film Ayalum Njanum Thammil. People are surprised to see Priya's singing skills and they have welcomed her yet again with open arms. The actress has taken formal training in music and is perfect with her pitch as well. After her Dubsmash videos, her singing videos have gained popularity and are doing the rounds on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu