»   » నేను చాలా నాటీ పిల్లని..లెక్కలేనన్ని లవ్ లెటర్స్, బన్నీ అంటే ఇష్టం అంటున్న ప్రియా వారియర్!

నేను చాలా నాటీ పిల్లని..లెక్కలేనన్ని లవ్ లెటర్స్, బన్నీ అంటే ఇష్టం అంటున్న ప్రియా వారియర్!

Subscribe to Filmibeat Telugu
నేను చాలా నాటీ పిల్లని..లెక్కలేనన్ని లవ్ లెటర్స్

ప్రియా ప్రకాష్ వారియర్ టీనేజ్ వయసులోనే కుర్రాళ్ళ గుండెల్లో కేవలం ఒక్క వీడియోతో కొలువుండి పోయింది. ప్రియా ప్రకాష్ వారియర్ ఇలాంటి స్టార్ డమ్ ని ఊహించి ఉండకపోవచ్చు. ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం ఓరు ఆదార్ లవ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియో సాంగ్ లో ప్రియా కన్నుగీటిన విధానం యువతని తెగ ఆకట్టుకుంది. ఊహించని స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న ప్రియా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించింది.

 అసలు ఊహించలేదు

అసలు ఊహించలేదు

తాను ఈ స్థాయి రెస్పాన్స్ కానీ, స్టార్ స్టేటస్ కానీ అసలు ఊహించలేదని ప్రియా తెలిపింది. ఓరు ఆధార్ లవ్ చిత్రం చేసే సమయంలో సాధారంణంగా అనిపించింది చేశామని ఇంత స్థాయిలో అది సక్సెస్ అవుతుందని ఊహించలేదని ప్రియా తెలిపింది.

స్కూల్ లైఫ్ గురించి

స్కూల్ లైఫ్ గురించి

తాను నటిస్తున్న ఒరు ఆధార్ లవ్ చిత్ర స్కూల్ లైఫ్ కి సంబంధించినదని ప్రియ వారియర్ తెలిపింది.

నేను చాలా నాటీ అమ్మాయిని

నేను చాలా నాటీ అమ్మాయిని

స్వతహాగా నేను నాటీ అమ్మాయిని అందువలన కష్టపడకుండానే ఒరు ఆధార్ లవ్ చిత్రంలో నటించగలిగానని ప్రియా తెలిపింది. నా స్కూల్ డేస్ లో అల్లరి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్నేహితులతో కలసి అనేక మార్లు క్లాసులు ఎగ్గొట్టా అని ప్రియా తెలిపింది.

 చాలా ప్రేమ లేఖలు వచ్చాయి

చాలా ప్రేమ లేఖలు వచ్చాయి

తనకు స్కూల్ రోజులనుంచి ప్రేమ లేఖలు రాక మొదలైందని ప్రియా తెలిపింది. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వస్తున్న ప్రేమ లేఖలని మాత్రం గమనిస్తున్నా అని నవ్వుతూ తెలిపింది.

 స్టార్‌డమ్ శాశ్వతం కాదు..

స్టార్‌డమ్ శాశ్వతం కాదు..

స్టార్ స్టేటస్ శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఫాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగా రాణించడానికి కష్టపడుతా అని ప్రియా వారియర్ వెల్లడించింది.

 అన్ని చిత్ర పరిశ్రమల్లో నటిస్తా

అన్ని చిత్ర పరిశ్రమల్లో నటిస్తా

ఈ వీడియో విడుదలయ్యాక అన్ని చిత్ర పరిశ్రమల్లో నటించడానికి అవకాశాలు వస్తున్నాయని ప్రియా వారియర్ తెలిపింది.వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని అన్ని చిత్ర పరిశ్రమల్లో నటిస్తా అని ప్రియా వారియర్ తెలిపింది.

అల్లు అర్జున్ అభిమాన నటుడు

అల్లు అర్జున్ అభిమాన నటుడు

తెలుగులో అల్లు అర్జున్ అభిమాన నటుడు అని తెలిపింది. గన్ షాట్ తో ముద్దు పెట్టె వీడియోని అల్లు అర్జున్, ఆయన కొడుకు ఇమిటేట్ చేశారు. అది చాలా బావుంది అని ప్రియా వారియర్ తెలిపింది.

షారుఖ్, రణవీర్ సింగ్‌తో నటించాలని ఉంది

షారుఖ్, రణవీర్ సింగ్‌తో నటించాలని ఉంది

బాలీవుడ్ లో అందరి నటులతో నటించాలని ఉంది. ముఖ్యంగా షారుఖ్, రణవీర్ సింగ్ వంటి నటులతో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా అని ప్రియా వారియర్ తెలిపింది.

 తమ్ముడు పెద్ద క్రిటిక్

తమ్ముడు పెద్ద క్రిటిక్

తనకు ఓ తమ్ముడు ఉన్న విషయాన్ని తెలిపింది ప్రియా వారియర్. తనకు తన తమ్ముడే పెద్ద క్రిటిక్. ఓరు ఆధార్ లవ్ వీడియో చూసి ఇందులో ఏముంది, అంతా ఎందుకు తెగ చూస్తున్నారు అని ఆట పట్టించాడని తెలిపింది.

 స్వేచ్ఛనిచ్చాం, హద్దుల్లో ఉండాలి

స్వేచ్ఛనిచ్చాం, హద్దుల్లో ఉండాలి

కేరీర్ పరంగా ఎదిగేందుకు తమ కుమార్తెకు స్వేచ్చనిచ్చాం అని ప్రియా వారియర్ తల్లిదండ్రులు తెలిపారు. కానీ హద్దుల్లో ఉంటూ, తన కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకోవడం ప్రియా వారియర్ పనే అని వారు సలహా ఇచ్చారు.

English summary
Priya Prakash Varrier told that she is getting love letters from boys. Allu Arjun is favourite hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu