»   » మోహన్ లాల్ కొడుకుతో లవ్ ఎఫైర్, డైరెక్టర్ కూతురు సమాధానం ఇదీ..

మోహన్ లాల్ కొడుకుతో లవ్ ఎఫైర్, డైరెక్టర్ కూతురు సమాధానం ఇదీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సౌతిండియా ఫిల్మ్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి తెలుగులో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'హలో' మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదే ఆమెకు తొలి సినిమా. కళ్యాణి మీద గతంలో చాలా రూమర్స్ ఉన్నాయి.

ప్రముఖ మళయాలం నటుడు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్-కళ్యాణి మధ్య లవ్ ఎఫైర్ ఉందని చాలా కాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇద్దరూ కలిసి చాలా క్లోజ్‌గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడమే ఇందుకు కారణం.

వార్తలపై స్పందించిన కళ్యాణి

వార్తలపై స్పందించిన కళ్యాణి

ప్రణవ్‌తో లవ్ ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై కళ్యాణి స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, తమ మధ్య అలాంటి ఎఫైర్ లేదని కళ్యాణి స్పష్టం చేశారు. ఇంతకాలం తమ గురించి జరిగినదంతా తప్పుడు ప్రచారమే అని తెలిపింది.

పెద్దన్న లాంటోడు

పెద్దన్న లాంటోడు

ప్రణవ్ తనకు పెద్దన్న లాంటోడు, మా ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. క్లోజ్ గా ఉన్నంత మాత్రాన తమ మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు కాదని కళ్యాణి తెలిపారు.

అందరికీ రోల్ మోడల్

అందరికీ రోల్ మోడల్

ప్రణవ్ చాలా సింపుల్ గయ్. మా ఫ్యామిలీ సర్కిల్‌లో పిల్లలందరికీ రోల్ మోడల్. ఫోజులు కొట్టడం లాంటివేమీ చేయడు. అందరితో చాలా క్లోజ్‌గా ఉంటాడు. అందుకే ప్రణవ్ అంటే నాతో పాటు అందరికీ చాలా ఇష్టం అని కళ్యాణి తెలిపారు.

హలో

హలో

కళ్యాణి తెలుగు మూవీ ‘హలో' ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Filmmaker Priyadarshan's daughter Kalyani, who is gearing up to make her acting debut soon, has slammed the rumours on her love affair with Malayalam superstar Mohanlal's son, Pranav.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu