»   » ‘నా సావు నే సస్తా’ డైలాగుతో.... మహేష్ మూవీలో ఆఫర్ కొట్టేసాడు!

‘నా సావు నే సస్తా’ డైలాగుతో.... మహేష్ మూవీలో ఆఫర్ కొట్టేసాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏది అని ఎవరినడిగినా... అందరినోటా వచ్చే మొదటి పేరు 'పెళ్లి చూపులు' మూవీ. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టయిన ఈ చిత్రంలోని డైలాగులు, కామెడీ సీన్లు ఇంకా ఎవరూ మరిచిపోలేక పోతున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను తెగ నవ్వించారు. సినిమాలో ఓ సీన్లో ప్రియదర్శి చెప్పిన 'నా చావు నే చస్తా.. నీకెందుకు' అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది.

తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే... ప్రియదర్శికి తాజాగా భారీ ఆఫర్ వచ్చింది. మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ దెబ్బతో ప్రియదర్శి దశ తిరిగినట్లే, ఈ సినిమాలో క్లిక్ అయితే అతను తెలుగులో పెద్ద కమెడియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారంతా.

ముఖ్యంగా అతడు డైలాగులు చెప్పే విధానం, డైలాగ్ డెలివరీ స్లాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం......

మహేష్ బాబు మూవీలో...

మహేష్ బాబు మూవీలో...

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో ప్రియదర్శి ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ వెంట కనిపించే ఓ పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు.

భారీ బడ్జెట్ మూవీ

భారీ బడ్జెట్ మూవీ

మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో క్లిక్ అయితే ప్రియదర్శి పులికొండ దశ తిరిగినట్లే అంటున్నారంతా.

రకుల్

రకుల్

ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

నమ్రత

నమ్రత

ఈ చిత్రంలో మహేష్ బాబు భార్య నమ్రత కూడా గెస్ట్ రోల్ చేస్తుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఎస్.జె.సూర్య

ఎస్.జె.సూర్య

ఈచిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

మహేష్ బాబు

మహేష్ బాబు

ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నారు. డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేస్తారని, పొంగల్ నాటికి ఇది రిలీజ్ కావచ్చునని అంటున్నారు.

English summary
Actor Priyadarshi Pullikonda, who will be playing the role of superstar Mahesh Babu’s friend in an upcoming, yet-untitled Telugu-Tamil bilingual project, says he will be starstruck working alongside the latter and rubbing shoulders with director A.R. Murugadoss and cinematographer Santosh Sivan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu